ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులకు గిట్టుబాటు ధర కల్పనే ప్రభుత్వ లక్ష్యం

ABN, Publish Date - Apr 30 , 2025 | 10:30 PM

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తుందని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పేర్కొన్నారు. స్థానిక మార్కెట్‌ యార్డులో బుధవారం నూతనంగా ఏర్పాటుచేసిన కం దుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారం భించారు.

మాజీ ఎమ్మెల్యే పాపారావు

దర్శిలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్యే పాపారావు, పాల్గొన్న ఏడీఏ బాలాజీనాయక్‌ తదితరులు

దర్శి, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తుందని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పేర్కొన్నారు. స్థానిక మార్కెట్‌ యార్డులో బుధవారం నూతనంగా ఏర్పాటుచేసిన కం దుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారం భించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రైతులు ప్రైవేట్‌ వ్యాపారుల దోపిడీ వల్ల నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ధా న్యం కొనుగోలు కేంద్రాలను, కందుల కొనుగోలు కేం ద్రాలను అనేకచోట్ల ఏర్పాటు చేసిందన్నారు. కందుల క్వింటాకు కేంద్రప్రభుత్వం రూ.7550 మద్దతు ధర కల్పించిందన్నారు. ఆమేరకు అధికారులు కొను గోలు కేంద్రాల్లో కొనుగోలు చేయటం జరుగుతుం దన్నారు. రైతులు పండించిన పంటలు కేంద్రాల్లో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలన్నారు.

కార్యక్రమంలో ఏడీఏ బాలాజీనాయక్‌, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, డిస్ట్రి బ్యూటరీ కమిటీ చైర్మన్‌ కె.వెలుగొండారెడ్డి, టీడీ పీ నాయకులు సంగా తిరుపతిరావు, యాదగిరి వాసు, మారెళ్ళ వెంకటేశ్వర్లు, ఎన్‌.అంకయ్య, తె లుగు మహిళా నాయకురాలు శోభారాణి, గుర్రం ప్రసాద్‌, మానికొండ మల్లికార్జునరావు, త్రినాధ్‌, రామగిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 10:30 PM