ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN, Publish Date - Apr 09 , 2025 | 11:18 PM

రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచిని కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చెప్పారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ముత్తుముల

గిద్దలూరు టౌన్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి):రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచిని కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చెప్పారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అశోక్‌రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగకపోగా అరాచకాలు మాత్రం పెరిగాయని చెప్పారు. ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తోందని గుర్తు చేశారు. గత వైసీపీ పాలనలో అనారోగ్యంతో బాధపడే పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఒక్క రూపాయి కూడా జగన్‌ అందించలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడే పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. గృహాలు లేనివారికి పక్కాగృహాలు మంజూరు చేస్తున్నామని, మాట ఇచ్చిన ప్రకారం ప్రతినెలా 1వ తేదీన ఇంటికి పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ, మండలపార్టీ అధ్యక్షులు శానేషావలి, మార్తాల సుబ్బారెడ్డి, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 11:18 PM