ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN, Publish Date - Jul 18 , 2025 | 01:12 AM
ప్రజా స మస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నియో జకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గురు వారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జరిగిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
తొమ్మిది పంచాయతీలకు ట్రాక్టర్లు,
ఏడుగురికి సీఎం సహాయ నిధి
చెక్కుల పంపిణీ
ముండ్లమూరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ప్రజా స మస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నియో జకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గురు వారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జరిగిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ అర్జీలను తక్షణమే పరిష్కరించాలని ఆయా శాఖలకు సూచించారు. ఒకే సమస్యపై కార్యాలయాల చుట్టూ పదేపదే తిప్పుకోవద్దన్నారు. మండల స్థాయి లో పరిష్కారం కాని సమస్యను తమ దృష్టికి తెచ్చినట్ల యితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేం దుకు
కృషి చేస్తానన్నారు.
ప్రధానంగా రెవెన్యూపరమైన సమస్యలతో పాటు విద్యుత్, హౌసింగ్ సమస్యలు ఎక్కువగా ప్రజల నుంచి అర్జీలు వచ్చినట్టు డాక్టర్ లక్ష్మి తెలిపారు. ఈ సమస్యల ను నిర్ణీత గడువులో పరిష్కరించాలన్నారు. ప్రజా దర్బా ర్ ప్రధాన ముఖ్య ఉద్దేశం కూడా గ్రామాల్లో ప్రజలకు ఉన్న సమస్యలను ప్రధానంగా పరిష్కరిస్తారన్న నమ్మ కం కలిగించటం కోసం వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవటం కోసమే ఇలాంటి దర్బార్‌లు నిర్వ హించటం జరుగుతుందన్నారు. ఆయా శాఖల వారీగా అర్జీలు స్వీకరించి ఆయా అధికారులతో సమీక్ష నిర్వ హించారు.
స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ముండ్లమూరు, పసుపుగల్లు, పెద ఉల్లగల్లు, కెల్లంపల్లి, మారెళ్ళ, నాయుడుపాలెం, ఉమామహేశ్వర అగ్రహారం, ఈదర, వేముల గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను అందజేశారు. మరో మూడు గ్రామాలకు డ్రోన్‌లు అం దజేశారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు కందులు అందజేశారు. ఉపాధి హామీ కార్యాలయం ఎదుట మొక్కలు నాటారు.
కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ లలిత్‌సాగర్, తహసీల్దార్ ఎల్.లక్ష్మీనారాయణ, దర్శి మార్కెట్ యార్డు చైర్మన్ దారం నాగవేణి సుబ్బా రావు, టీడీపీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాస రావు, మార్కెట్ యార్డు వైస్‌చైర్మన్ కోడెగ మస్తాన్ రావు, సర్పంచ్‌లు ఒద్దిపోగు ఆదిలక్ష్మి, కూరపాటి నారాయణ స్వామి, సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, గుంటుపల్లి రంగనాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికి సంక్షేమ ఫలాలు
ముండ్లమూరు, జూలై 17 (ఆంధ్ర జ్యోతి): ప్రతి ఇంటికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించటమే ప్రభుత్వ ధ్యేయ మని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గురువారం సాయం త్రం మండలం లోని వేముల, కమ్మవారిపాలెం, రాజగోపాల్‌రెడ్డి నగర్ గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్య క్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఏడాది కాలంలో పేదలకు అందించిన సంక్షేమ ఫలాలు, అభి వృద్ధి ఫలాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశా రు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న నా లుగు సంవత్సరాల్లో గ్రామాలకు అత్యధిక నిధులు కేటాయించి మౌలికవసతులు సమకూరుస్తా మన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, డాక్టర్ కడియాల లలిత్‌సాగర్, టీడీపీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, సర్పంచ్ గజ్జల ఆదెమ్మ పాల్గొన్నారు.
Updated Date - Jul 18 , 2025 | 01:12 AM