ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతు రాజుగా ఉండాలన్నదే లక్ష్యం

ABN, Publish Date - Jun 19 , 2025 | 11:54 PM

దేశానికి అన్నంపెట్టే రైతన్నలు రాజుగా ఉండాలన్నదే ప్రజా కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. పర్చూరు వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభం అనంతరం జరిగిన సభలో ఏలూరి మాట్లాడారు.

రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

పర్చూరు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి) : దేశానికి అన్నంపెట్టే రైతన్నలు రాజుగా ఉండాలన్నదే ప్రజా కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. పర్చూరు వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభం అనంతరం జరిగిన సభలో ఏలూరి మాట్లాడారు. నల్లబర్లీ పొగాకును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయటం చరిత్రాత్మకం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవసాయ రంగానికి ప్రఽథమ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రైతుల పరిరక్షణ ధ్యేయంగా నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేసి కూటమి కూటమి ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది ఇది చరిత్రలో నిలిచిపోతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. చివరి రైతు వరకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేస్తామని ప్రకటించినప్పుడు కొనుగోలు సాధ్యం కాదని, రైతులు అపోహ పడ్డారని, అసాధ్యాన్ని ప్రభుత్వం సుసాధ్యం చేసిందన్నారు. విదేశీ మారకద్రవ్యం అధికంగా వచ్చే బ్లాక్‌ బర్లీ పొగాకు పంటను ప్రభుత్వం అదుకుంటుందని ఏలూరి స్పష్టం చేశారు. బర్లీ పొగాకు పంటను రాష్ట్రంలోనే పర్చూరు నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా రైతులు సాగుచేసారని, వారికి ప్రభుత్వం కొండంత అండగా నిలిచిందన్నారు. తదుపరి ప్రభుత్వం నిర్ణయం మేరకు పంట సాగుచేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పెదపూడి విజయకుమార్‌, కలెక్టర్‌ జె. వెంకటమురళి, వేర్‌ హౌసింగ్‌ డైరెక్టర్‌ సురేష్‌ కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ గుంజి వెంకట్రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి రామకృష్ణ, మార్క్‌ఫెడ్‌ డీఎం కరుణశ్రీ, ఆర్డీవో గ్లోరియా, మార్కెటింగ్‌శాఖ అధికారి రమే్‌షబాబు, జిల్లా సహకార శాఖ అధికారి శ్యాంసన్‌, బుడ చైర్మన్‌ సలగల రాజశేఖర్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 11:54 PM