అన్నదాతల అభ్యున్నతే లక్ష్యం
ABN, Publish Date - Apr 23 , 2025 | 11:41 PM
అన్నదాతల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభు త్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. బుధవారం ఏలూరి క్యాంప్ కార్యాలయంలో ఐడీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తెచ్చేలా కార్యాచరణ రూపొందిం చాలన్నారు.
రైతులకు అందుబాటులో ఎత్తిపోతల పథకాలు
ఎమ్మెల్యే ఏలూరి
పర్చూరు, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : అన్నదాతల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభు త్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. బుధవారం ఏలూరి క్యాంప్ కార్యాలయంలో ఐడీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తెచ్చేలా కార్యాచరణ రూపొందిం చాలన్నారు. సకాలంలో ఆరు తడులకు నీరు అందిచడమే తన ముందు ఉన్న లక్ష్యమన్నారు. ఎత్తిపోతల పథకాలను రైతులు వినియోగించుకునే లా భాగస్వామ్యం కల్పిస్తున్నట్లు ఏలూరి వెల్లడించారు. వైసీపీ పాలనలో కనీసం మరమ్మతులు కూడా చేయక మూలనపడ్డాయన్నారు. సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారని ఏలూరి చెప్పారు. సాగర్ టైల్యాండ్ ఆయకట్టుకు నాలుగు నూతన పథకాలకు రూపకల్పన చేశామన్నారు. పథకాల అభివృద్ధికి అంచనాలను ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులకు ఏలూరి సూచించారు. నియోజకవర్గంలోని చివరి అయకట్టు భూములకు సైతం నీరు అందించే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. సమావేశంలో ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాగ్యలక్ష్మి, విశ్రాం త ఇరిగేషన్ ఇంజనీర్ సత్యనారాయణ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపినాఽథ్, శివరామయ్య పాల్గొన్నారు.
Updated Date - Apr 23 , 2025 | 11:41 PM