ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్లాస్టిక్‌పై సమరం

ABN, Publish Date - Mar 16 , 2025 | 01:33 AM

మనిషి ఆరోగ్యానికి తీవ్ర హానిచేసే ప్లాస్టిక్‌ వాడకంపై ప్రభుత్వం సమరం ప్రారంభించింది. ప్రతినెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈసారి సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ నిషేధంపై దృష్టిపెట్టింది.

కొండపిలో ఎక్స్‌కవేటర్‌తో చెత్త తొలగింపు పనులను ప్రారంభిస్తున్న మంత్రి స్వామి

అదే ప్రధానాంశంగా స్వచ్ఛాంధ్ర నిర్వహణ

జిల్లావ్యాప్తంగా ర్యాలీలు

వస్త్ర సంచుల పంపిణీ, ప్రతిజ్ఞలు

కొండపిలో పాల్గొన్న మంత్రి డాక్టర్‌ స్వామి

ఇతర ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యం

ఒంగోలు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : మనిషి ఆరోగ్యానికి తీవ్ర హానిచేసే ప్లాస్టిక్‌ వాడకంపై ప్రభుత్వం సమరం ప్రారంభించింది. ప్రతినెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈసారి సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ నిషేధంపై దృష్టిపెట్టింది. ప్లాస్టిక్‌ వాడకం వలన జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రత్యామ్నాయంగా వస్త్ర, జూట్‌ సంచులు వాడాలని కోరుతూ వాటిని పంపిణీ చేసే కార్యక్రమాలను చేపట్టారు. జిల్లావ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అవగాహన ర్యాలీలు, సభలు, సమావేశాలు, ప్రజలతో ప్రతిజ్ఞలతోపాటు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల మొక్కలు కూడా నాటారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కొండపిలో అవగాహన ర్యాలీలో పాల్గొనడంతోపాటు అక్కడి పంచాయతీలో చెత్త తరలింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వయంగా ఎక్స్‌కవేటర్‌ను నడిపి చెత్తను తొలగించారు. ఒంగోలులో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాలు నగరంలోని కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులకు ప్లాస్టిక్‌ సంచుల నిషేధంపై అవగాహన కల్పించడంతోపాటు వస్త్ర సంచులు పంపిణీ చేశారు. అంతకు ముందు పాత బైపాస్‌ రోడ్డులోని ట్రెజరీ కార్యాలయంలో మొక్కలు నాటి మామిడిపాలెం ఎస్‌ఎస్‌ ట్యాంకు వద్ద ట్రిపుల్‌ ఆర్‌ పార్కును ప్రారంభించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ చీమకుర్తిలో, దర్శిలో జరిగిన కార్యక్రమంలో అక్కడి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కనిగిరి పట్టణంలో, మార్కాపురంలో అక్కడి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరులో అక్కడి ఎమ్మెల్యే ఎం.అశోక్‌రెడ్డిలు స్వచ్చాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. టీడీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు దోర్నాలలో పాల్గొన్నారు. అక్కడ వీధులు ఊడ్చి ప్లాస్టిక్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లావ్యాప్తంగా వివిధ స్థాయిల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించగా ప్రభుత్వ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో కూడా స్వచ్చాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు.

Updated Date - Mar 16 , 2025 | 01:33 AM