ముగిసిన ఖోఖో
ABN, Publish Date - Apr 27 , 2025 | 11:04 PM
కేంద్రీయ విద్యాలయ రీజనల్ ఖోఖో పోటీలలో విజేతలుగా నల్గొండ బాలికలు, ఖమ్మం బాలుర జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి.
విజేతలుగా నల్గొండ, ఖమ్మం జట్లు
వేర్వేరుగా పాల్గొన్న బాలికల, బాలుర టీంలు
ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో రీజనల్ పోటీల నిర్వహణ
ఒంగోలు, కార్పొరేషన్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి) : కేంద్రీయ విద్యాలయ రీజనల్ ఖోఖో పోటీలలో విజేతలుగా నల్గొండ బాలికలు, ఖమ్మం బాలుర జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. వివరాల్లోకెళితే... ఈనెల 24వ తేదీ నుంచి ఒంగోలులోనికేంద్రీయ విద్యాలయలో నిర్వహించిన వార్షిక క్రీడా పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ పోటీలలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి వివిధ కేంద్రీయ విద్యాలయ పాఠశాలలకు చెందిన 16 బాలికల జట్లు, 13 బాలుర జట్లు పాల్గొన్నాయి. బాలికల విభాగంలో నల్గొండ కేంద్రీయ విద్యాలయ జట్టు ప్రథమ స్థానంలో, ఖమ్మం కేవీ జట్టు ద్వితీయ స్థానం, జిల్లాకు చెందిన రాజంపల్లి కేవీ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో ఖమ్మం కేవీ జట్టు ప్రథమ స్థానంలో, కాంచన్ బాగ్ కేవీ జట్టు ద్వితీయ స్థానం, బార్కాస్ సీఆర్‌పీఎఫ్ కేవీ జట్టు తృతీయ స్థానంలో విజయం సాధిచాయి. ఈ సందర్భంగా విద్యాలయ ప్రిన్సిపాల్ మనీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ శ్రీదేవి, కేవీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ బీ సూర్యప్రకాశరావు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వ్యాయామోపాధ్యాయులు అతిష్, పాఠశాల అధ్యాపక సిబ్బంది హఫీజ్, ఎంఎ్‌స.రావు, రాజేష్, షాహిదా, కొండయ్య, బాషా గులాబ్ హాజరయ్యారు.
Updated Date - Apr 27 , 2025 | 11:04 PM