వస్త్రవ్యాపారి ఆత్మహత్య
ABN, Publish Date - May 06 , 2025 | 11:31 PM
వస్త్ర వ్యాపారం చేసే గోలి బాలశంకర్(45) ఇంట్లో ఉరివేసుకొని ఆతహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానిక పవర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఎన్‌జీవో కాలనీలో చోటుచేసుకుంది.
వ్యాపారంలో నష్టాలతో సతమతం
మానసిక క్షోభతో మద్యానికి బానిస
ఒంగోలు క్రైం, మే 6(ఆంధ్రజ్యోతి) : వస్త్ర వ్యాపారం చేసే గోలి బాలశంకర్(45) ఇంట్లో ఉరివేసుకొని ఆతహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానిక పవర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఎన్‌జీవో కాలనీలో చోటుచేసుకుంది. చీరాలకు చెందిన బాలశంకర్ ఎనిమిదేళ్ల క్రితం ఒంగోలు వచ్చి బాపూజీ మార్కెట్‌లో వస్త్రవ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో వచ్చిన నష్టాలకు అప్పుల పాలయ్యాడు. మానసిక క్షోభతో మద్యానికి బానిసయ్యాడు. సోమవారం అర్ధరాత్రి భార్యాపిల్లలు బెడ్ రూంలో పడుకొని ఉండగా హాల్‌లో ఉన్న బాలశంకర్ ఒక్కసారిగా పెద్దగా అరిచి పిల్లలను బాగా చదువుకోవాలని చెప్పడంతో భార్య ఇద్దరు పిల్లలు పరుగున బయిటికి వచ్చారు. అప్పటికే కేబుల్ వైర్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న వేలాడుతున్న బాలశంకర్‌ను కిందకు దించారు. అనంతరం మళ్లీ బెడ్ రూంలోకి వెళ్లితలుపులు బిగించుకుని ఐరన్ బాక్స్ వైరుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. దీంతో చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు పెకిలించి అతనిని 108 ద్వారా రిమ్స్‌కు తరలించగా అక్కడ మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు బాలశంకర్ మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని ఆయన భార్య భారతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - May 06 , 2025 | 11:31 PM