ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బడులు తెరిచినరోజే.. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు

ABN, Publish Date - May 18 , 2025 | 10:30 PM

గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం బడి తెరచిన రోజే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందించేలా విద్యాశాఖ అధికారులు సంసిద్ధమయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పటిష్ట చర్యలు చేపట్టింది.

ఇప్పటికే మండలానికి చేరిన వైనం

వచ్చే విద్యాసంవత్సరంలో

ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

దొనకొండ, మే 18 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం బడి తెరచిన రోజే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందించేలా విద్యాశాఖ అధికారులు సంసిద్ధమయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పటిష్ట చర్యలు చేపట్టింది. 2025-26 విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికి పాఠ్యపుస్తకాలన్నీ పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందజేయాలనే ప్రణాళికలు రూపొందించి ఆమేరకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే మండల కేంద్రాలకు పాఠ్యపుస్తకాలు చేరాయి.

గత వైసీపీ ప్రభుత్వంలో అన్నీ సబ్జెక్టులకు చెందిన పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో పంపిణీ జరగకపోవటంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం అటువంటి పరిస్థితులు తలెత్తకుండా వేసవి సెలవల్లోనే పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు చేరేలా చర్యలు చేపట్టింది. దొనకొండ మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 65 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 5800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి 25వేల వరకు పాఠ్య పుస్తకాలు అవసరం కాగా, ప్రస్తుతం మండలానికి 20వేల వరకు పాఠ్యపుస్తకాలు చేరాయి. మిగిలిన పుస్తకాలు త్వరలో రానున్నట్లు మండల విద్యాశాఖ తెలుపుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ఉజ్వల భవిషత్తే లక్ష్యంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుండటంపట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల ఆదేశాలతో పాఠశాలలకు చేరుస్తాం

- ఎన్‌.సాంబశివరావు, ఎంఈవో

మండల కేంద్రానికి ఉచిత పాఠ్యపుస్తకాలు చేరాయి. ఉన్నతాధి కారులు ఆదేశాలు జారీచేసిన వెంటనే పాఠశాలలకు చేరుస్తాం. బడులు తెరచిన రోజే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు అందించేలా సంసిద్ధంగా ఉన్నాం.

Updated Date - May 18 , 2025 | 10:30 PM