మహిళల సమున్నత అభివృద్ధే టీడీపీ లక్ష్యం
ABN, Publish Date - Jun 09 , 2025 | 12:07 AM
మహిళల సమున్నత అభివృద్ధే టీడీపీ లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంతో పాటు, మండలం, కొనకనమిట్ల మండలాల వెలుగు సిబ్బంధి,
ఎమ్మెల్యే కందుల
పొదిలి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి) : మహిళల సమున్నత అభివృద్ధే టీడీపీ లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంతో పాటు, మండలం, కొనకనమిట్ల మండలాల వెలుగు సిబ్బంధి, వీవోఏలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదిలి, కొనకనమిట్ల మండలాల్లో దాదాపు రూ.2వేల800 గ్రూపులు ఉన్నాయని, ఈగ్రూపుల్లో వారి కి రూ.50కోట్ల వరకు ప్రభుత్వం రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈరుణాలతో వెలుగు సిబ్బంది, వీవోఏలు, గ్రామ పార్టీ నాయకులు సమిష్టిగా కృషి చేసి డ్వాక్రాగ్రూపులను అభివృద్ధి చేయాలన్నారు. కొనకనమిట్ల మండలంలో 3వేల ఎకరా ల్లో రూ.1500కోట్లతో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఏటా రైతులకు ఎకరాకు రూ.30వేల రూపాయలు, అసైన్‌మెంట్ భూములకు ఎకరాకు రూ.15వేల వరకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇటువంటి ఇండస్ర్టీని మండలంలో ఏర్పాటు చేసి నిరుద్యోగులకు భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపా రు. అనంతరం ఎమ్మెల్యే కందులను వెలు గు సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వెలుగు సిబ్బంధి, వీవోఏలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jun 09 , 2025 | 12:07 AM