వాట్సాప్ గవర్నెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - May 16 , 2025 | 12:02 AM
Take advantage of WhatsApp governance services
ఒంగోలు కలెక్టరేట్, మే 15 (ఆంధ్రజ్యోతి) : మన మిత్ర- ప్రజల చేతిలో ప్రభుత్వం ద్వారా వాట్సప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగంచేసుకోనే విధంగా చూడాలని సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో గురువారం సాయంత్రం వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై రూపొందించిన క్యూ ఆర్ కోడ్ సేవలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వాట్సాప్స్ గవర్నెస్ ద్వారా 161 ప్రభుత్వ సేవలను మొదటిసారిగా అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ సేవలు సాంకేతికంగా, సురక్షితం అని చెప్పారు. ప్రజల గోప్యత పట్ల అధిక ప్రాధాన్యతను ప్రభుత్వం ఇచ్చిందన్నారు. వాట్సాప్ గవర్నెస్ ద్వారా తొలిదశలో 161 ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయని, రెండో విడతలో మరో 360 రకాల సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుందని చెప్పారు. అందుకోసం 9552300009 నెంబర్‌ను వాట్సాప్ ద్వారా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు చిరంజీవి, వెంకటనాయుడు, నారాయణ, శ్రీహరి, బాలశంకరరావు, సీపీవో వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
Updated Date - May 16 , 2025 | 12:02 AM