ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - May 04 , 2025 | 10:38 PM

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన కందుల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మండలంలోని తాళ్ళూరు గ్రామంలో ఏర్పాటుచేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు.

కొనుగోలు కేంద్రంలోని కందులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, మే 4 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన కందుల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మండలంలోని తాళ్ళూరు గ్రామంలో ఏర్పాటుచేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు.

ఈసం దర్భంగా మాట్లాడుతూ రైతులు సులభంగా తమ పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్ళి విక్రయించుకోవచ్చునని చెప్పారు. దీనివల్ల రైతులకు రవాణా ఖర్చు తగ్గడంతోపాటు పంటను త్వరగా అమ్ముకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఈసంద ర్భంగా రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. ఈక్రాప్‌లో వచ్చే సమస్యలతో పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నిబంధనలను సడలించి పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేవిధంగా కృషి చేయాలని డాక్టర్‌ ఉగ్రనరసింహా రెడ్డిని కోరారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి వెంట బాలు ఓబులురెడ్డి, సుబ్రమణ్యం, తదితరులు ఉన్నారు.

Updated Date - May 04 , 2025 | 10:38 PM