అనాథలకు ఆసరా
ABN, Publish Date - Jul 29 , 2025 | 01:21 AM
తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ప్రభుత్వం కల్పించే వసతులతో విద్యాభ్యాసం చేసే చిన్నారులకు పీ4 పథకం ఆసరాగా నిలుస్తోంది. ఇప్పటికే పలువురు అధికారులు అనాథలైన చిన్నారులను దత్తత తీసుకుని ఆదర్శంగా నిలిచారు.
తండ్రి కరోనాతో.. తల్లి క్యాన్సర్‌తో మృతి
ప్రభుత్వ పిలుపుతో ఇద్దరు బాలికలను దత్తత తీసుకున్న త్రిపురాంతకం ఎంఈవో
త్రిపురాంతకం, జూలై 28 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ప్రభుత్వం కల్పించే వసతులతో విద్యాభ్యాసం చేసే చిన్నారులకు పీ4 పథకం ఆసరాగా నిలుస్తోంది. ఇప్పటికే పలువురు అధికారులు అనాథలైన చిన్నారులను దత్తత తీసుకుని ఆదర్శంగా నిలిచారు. సోమవారం త్రిపురాంతకంలోని కేజీబీవీ పాఠశాలలో ఇద్దరు చిన్నారులను ఎంఈవో రాజశేఖరరెడ్డి దత్తత తీసుకున్నారు. చిన్నారుల్లో కావేరిబాయి ఆరో తరగతి, మానసబాయి ఏడో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ గణపవరం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందినవారు. తండ్రి కొవిడ్ కారణంగా, తల్లి క్యాన్సర్‌బారిన పడి మరణించారు. వారికి అవసరమైన కనీస వసతులు, అవసరాలు తీరుస్తానని ఎంఈవో చెప్పారు. సోమవారం వారికి దుస్తులు, దుప్పట్లు, సబ్బులు, నూనె ఇతర వస్తువులు అందజేశారు.
Updated Date - Jul 29 , 2025 | 01:21 AM