ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేటి నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

ABN, Publish Date - May 19 , 2025 | 01:28 AM

జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ.. ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 4,283 మంది హాజరుకానున్నారు.

ఒకే కేంద్రంలో టెన్త్‌ రెగ్యులర్‌, ఓపెన్‌ స్కూల్‌కు నిర్వహణ

‘ఓపెన్‌’ ఇంటర్‌ విద్యార్థులకు ప్రత్యేకంగా కేంద్రాలు

ఒంగోలు విద్య, మే 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ.. ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 4,283 మంది హాజరుకానున్నారు. వారిలో బాలురు 2,400 మంది, బాలికలు 1,883 మంది ఉన్నారు. వీరికోసం 36 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. కాపీయింగ్‌ను కట్టడి చేసేందుకు నాలుగు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశా రు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను నిషేధిం చారు. ఒకే కేంద్రంలో రెండు రకాల పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్‌ విద్యార్థులకు ఏర్పాటు చేసిన వాటిలో 11 కేంద్రాలను ఓపెన్‌ స్కూలు సొసైటీకి సంబం ధించిన 1,250 మందికి కూడా కేటాయించారు. రెండు పరీక్షలను వేర్వేరుగా చీఫ్‌లు, డీవోలు, ఇన్విజిలేటర్లు పనిచేస్తారు. ఓపెన్‌ సొసైటీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 3,132 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వారికోసం ప్రత్యేకంగా 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాపీయింగ్‌ను నిరోధించేందుకు మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు.

Updated Date - May 19 , 2025 | 01:28 AM