కార్యకర్తల కష్ట ఫలితమే విజయం
ABN, Publish Date - May 19 , 2025 | 10:47 PM
వైసీపీ నాయకులు ఎన్ని దౌర్జాన్యాలకు పాల్పడినా, అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టినా మొక్కవోని దీక్షతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలబడి పోరా టం చేయబట్టే ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించిందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అ న్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదాం
నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యం
ఎమ్మెల్యే నారాయణరెడ్డి
జోష్ నింపిన మినీ మహానాడు
మార్కాపురం, మే 19 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ నాయకులు ఎన్ని దౌర్జాన్యాలకు పాల్పడినా, అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టినా మొక్కవోని దీక్షతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలబడి పోరా టం చేయబట్టే ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించిందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అ న్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మహానాడు కార్యక్రమం కాలేజీ రోడ్డులోని శుభం కన్వెన్షన్ హాలులో సోమవారం ఉత్సాహభరిత వాతావరణం లో జరిగింది. ముందుగా స్థానిక దోర్నాల బస్టాండ్‌లోని పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆపరేషన్ సిందేర్‌లో దేశం కో సం ప్రాణాలర్పించిన వీర జనాన్లకు మౌనం పా టించి అంజలి ఘటించారు. అనంతరం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ అఽధ్యక్షతన మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు క్రమశిక్షణగల సైనికులన్నారు. వారి కృషి, త్యాగాల ఫలితంగానే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ విజయాన్ని శాశ్వతం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పార్టీ కుటుంబంలాంటిదన్నారు. చిన్నచిన్న సమస్యలుంటే మనమే అంతర్గతంగా సమీక్షించుకుని చక్కదిద్దుకోవాలన్నారు. మనపై ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పకొట్టాలన్నారు. ఐదేళ్లపాటు రాక్షసపాలన సాగిందన్నారు. అన్ని వ్యవస్థలను వైసీపీ నాయకులు నిర్వీర్యం చేశారన్నారు. ముఖ్యంగా ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం వెనుకబడిపోయిందన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో అనుభవశాలి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు సంక్షేమాన్ని కొనసాగిస్తూనే పారిశ్రామికంగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇ చ్చిన హామీ మేరకు ఎన్ని ఆర్థిక అవరోధాలు ఉన్నా ఒక్కక్కటిగా అమలు చేస్తున్నారన్నారు. ఇక నుంచి గ్రామ, మండలస్థాయిలో సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించుకోవాలన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని మండల స్థాయిలోని కమిటీ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి విజయఢంకా మోగిద్దామన్నారు. చాలాచోట్ట గ్రామాల్లో వైసీపీ నాయకులు పెత్తనం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. మన వాళ్లు సహకరించకుంటే వాళ్లు అంతటిస్థాయిలో రెచ్చిపోయే అవకాశాలు లేవన్నారు. ఎక్కడైనా కట్టుతప్పితే పార్టీ ఆదేశానుసారం క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. పార్టీ భవితవ్యం మనందరికీ ముఖ్యమన్నారు. అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
వెలిగొండ, మార్కాపురం జిల్లాను సాధిస్తా
పశ్చిమ ప్రకాశానికి ఆశాదీపమైన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును 2026 ఆగస్టు కల్లా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇప్పటికే సుమారు మూడు విడతల్లో ప్రభుత్వం ని ధులు కూడా మంజూరు చేసిందన్నారు. గత వైసీపీ హయాంలో జగన్‌రెడ్డి ప్రాజెక్టు పూర్తికాకుండానే జాతికి అంకితం చేశారన్నారు. టన్నెల్స్ పనులను ఇష్టారీతిన చేశారన్నారు. ఏ బడ్జెట్‌లోనూ ప్రాజెక్టుకు గత వైసీపీ ప్రభుత్వం నిధులు కేటాయించలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రుల బృందం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందన్నా రు. ప్రస్తుతం పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. అదే విధంగా మార్కాపురం జిల్లా సాధన కోసం కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే పలు పర్యాయాలు ముఖ్య నేతలను కలిసి జిల్లా ఆవశ్యకతను కూడా వివరించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురాన్ని జిల్లా చేస్తానని ఇప్పటికే ప్రకటించిన విష యం తెలిసిందేనన్నారు. అలాగే మెడికల్ కాలేజీ పనులు కూడా పీపీపీ పద్ధతిలో త్వరలో ప్రారంభమవుతాయన్నారు. ఇవి పూర్తయితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. అం తేకాక ప్రతి నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఎం ఎస్‌ఎంఈ పార్కులను ప్రభుత్వంకేటాయించిందన్నారు.రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతు లు ముందుకు వస్తే ఎన్ని ప్లాంట్లు అయినా ఇచ్చేందుకు కంపెనీ సిద్ధంగా ఉందన్నారు. ఇవి ఏర్పాటైతే ఈ ప్రాంతంలో వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ సంద ర్భంగా పలువురు టీడీపీ ముఖ్య నేతలు ప్రసంగించారు. ఆయా పట్టణాలు, మండలాల్లోని సమస్యలను తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున్, డాక్టర్ స్వర్ణ గీత, మాలపాటి వెంకటరెడ్డి, గుంటక సుబ్బారెడ్డి, వరికుంట్ల అనిల్, కామసాని రామిరెడ్డి, కంచర్ల కాశయ్య, అన్ని పట్టణ, మండల కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎమ్‌పీటీసీలు, క్లస్టర్ ఇంచార్జీలు, బూత్ కమిటీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
Updated Date - May 19 , 2025 | 10:47 PM