ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు

ABN, Publish Date - May 08 , 2025 | 10:39 PM

గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవ ని డీఎస్పీ సాయిఈశ్వర్‌ యశ్వంత్‌ అన్నారు. పట్టణంలో గంజాయి అమ్ము తున్న నలుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సాయిఈశ్వర్‌యశ్వంత్‌

కనిగిరి, మే 8 (ఆంధ్రజ్యోతి): గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవ ని డీఎస్పీ సాయిఈశ్వర్‌ యశ్వంత్‌ అన్నారు. పట్టణంలో గంజాయి అమ్ము తున్న నలుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప ట్టణంలోని దొరువు వద్ద అక్రమంగా గంజాయి నిల్వ ఉంచిన స్థావరంపై ఆకస్మిక దాడి చేసి 1.5 కేజీలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. దొరువు ప్రాంతానికి చెందిన నాగులూరి రాజేష్‌, నాగులూరి దుర్గా ప్రసాద్‌తో పాటు మరో ఇద్దరు మహిళలు పట్టణానికి చెందిన నాగులూరి వెంకటేశ్వర్లు, నాగు లూరి అంకబాబు వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన గంజాయిని చిన్న, చిన్న ప్యాకెట్‌లుగా చేసి అమ్ముతున్నట్లు తెలి పారు. గురువారం కార్డెన్‌ సెర్చ్‌లో భాగంగా దొరువు ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా అక్రమంగా నిల్వ ఉంచిన గంజాయిని గుర్తించినట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకు న్నట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుచను న్నట్లు డీఎస్పీ తెలిపారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి గంజాయిని పట్టుకున్న సీఐ ఖాజావలి, ఎస్‌ఐ టి.శ్రీరాం, మాధవరావు, పీసీపల్లి ఎస్‌ఐని డీఎస్పీ అభినందించారు. గంజాయి అమ్మకాలు చేస్తుంటే సంబంధిత వ్యక్తు ల వివరాలను తెలియాజేయాలన్నారు. తెలిపినవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. సమావేశంలో సీఐ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 10:39 PM