వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి
ABN, Publish Date - May 13 , 2025 | 11:00 PM
వేసవి కాలంలో పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మున్సిపల్ గుంటూరు ఆర్‌డీ ఓబులేసు అన్నారు. మార్కాపురం పురపాలక సంఘంలోని తాగునీటి సరఫరాకు సంబంధించిన అన్ని వ్యవస్థలను, పనులను మంగళవారం మున్సిపల్ ఆర్‌డీ ఓబులేసు, నెల్లూరు ప్రజారోగ్య శాఖ ఎస్‌ఈ టి.మోహన్ పరిశీలించారు.
మున్సిపల్ ఆర్‌డీ ఓబులేసు
మార్కాపురం, మే 13 (ఆంధ్రజ్యోతి) : వేసవి కాలంలో పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మున్సిపల్ గుంటూరు ఆర్‌డీ ఓబులేసు అన్నారు. మార్కాపురం పురపాలక సంఘంలోని తాగునీటి సరఫరాకు సంబంధించిన అన్ని వ్యవస్థలను, పనులను మంగళవారం మున్సిపల్ ఆర్‌డీ ఓబులేసు, నెల్లూరు ప్రజారోగ్య శాఖ ఎస్‌ఈ టి.మోహన్ పరిశీలించారు. అనంతరం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌డీ ఓబులేసు మాట్లాడుతూ దూపాడు సమ్మర్ స్టోరేజీ వద్ద 1.5 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న డీఐ పైప్‌లైన్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ఇంజనీరింగ్ అధికారులు చూడాలన్నారు. పనులు నాణ్యతతో జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ పనులు పూర్తయిన తర్వాత ప్రజలకు రెండు రోజులకోసారి సాగర్ నీటిని అందించాలన్నారు. అదే విధంగా పట్టణంలో నీటి సరఫరా విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా నీటి నాణ్యత, పైప్‌లైన్ లీకేజీల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి పన్నులు, నీటి కొళాయి పన్నుల వసూళ్లకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా అన్ని మురికి కాలువలను డీసిల్టేషన్ చేయించాలన్నారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నెల్లూరు ఎస్‌ఈ టి.మోహన్, ఒంగోలు ఈఈ టి.శ్రీనివాససంజయ్, మున్సిపల్ కమిషనర్ డీవీఎస్ నారాయణరావు, డీఈ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - May 13 , 2025 | 11:00 PM