18 నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
ABN, Publish Date - May 10 , 2025 | 11:33 PM
కంభం మండలం రావిపాడులో వెలసిన శ్రీరుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి తిరునాళ్ల సందర్భంగా ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శనివారం ప్రకటనలో తెలిపారు.
కంభం, మే 10 (ఆంధ్రజ్యోతి) : కంభం మండలం రావిపాడులో వెలసిన శ్రీరుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి తిరునాళ్ల సందర్భంగా ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శనివారం ప్రకటనలో తెలిపారు. పురుషుల ఓపెన్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలో గెలుపొందిన జట్లకు ప్రథమ బహుమతిగా రూ.40వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30వేలు, తృతీయ బహుమతిగా రూ.20వేలు, నాల్గవ బహుమతిగా రూ.10వేలు అందజేస్తారన్నారు. ఉత్తమ రైడర్‌కు రూ.1116, ఉత్తమ డిఫెండర్‌కు రూ.1116 ఇవ్వనున్నారు. పోటీలో పాల్గొనే కబడ్డీ జట్లు ఈనెల 15వ తేదీ సాయంత్రం 8గంటలలోపు రూ.500 సభ్యత్వ రుసుము చెల్లించాలని, వివరాలకు 8184855244, 7036064032 సంప్రదించాలన్నారు.
Updated Date - May 10 , 2025 | 11:33 PM