ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

ABN, Publish Date - Apr 21 , 2025 | 11:24 PM

జిల్లా వ్యాప్తంగా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా ప్రజా సమస్యల వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ వెంకటమురళి పేర్కొన్నారు. సోమవారం చీరాల మునిసిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల వేదికలో జేసీ ప్రకర్‌జైన్‌తో కలిసి ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) నిర్వహించారు.

చీరాల మునిసిపల్‌ కార్యాలయంలో ‘మీకోసం’

చీరాల, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా ప్రజా సమస్యల వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ వెంకటమురళి పేర్కొన్నారు. సోమవారం చీరాల మునిసిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల వేదికలో జేసీ ప్రకర్‌జైన్‌తో కలిసి ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి అర్జీలను అందజేశారు. వీరిలో అధిక శాతం భూములకు, నివేశన స్థలాలు, హౌసింగ్‌, పెన్షన్‌ల సమస్యలు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా పరిధిలో గిరిజన, విభిన్న ప్రతిభావంతుల సమస్యలకు సంబంధించి ప్రతి మూడవ శనివారం మీకోసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, చీరాల పట్టణ అభివృద్ధి పనులపై మాట్లాడారు. అలాగే పట్టణంలో నివాసముంటున్న సంచారజాతులు (వేస్ట్‌ పిక్కర్స్‌) ప్రాంతాన్ని పరిశీలించి సమస్యలు తెలుసుకొని త్వరలో వారికి నివేశన స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారి గంగాధర్‌ గౌడ్‌, డీపీవో ప్రభాకర్‌, డ్వామా పీడీ విజయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధా మాధవి, జిల్లా వైద్యాధికారి విజయమ్మ, జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజ్‌ దిబోరా, చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, మునిసిపల్‌ కమిషనర్‌ అబ్దుల్‌ రషీద్‌, చీరాల వేటపాలెం తహసీల్దార్‌లు గోపీకృష్ణ, పార్వతి పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 11:24 PM