మళ్లీ మారిన ప్రత్యేక తరగతుల పనివేళలు
ABN, Publish Date - May 05 , 2025 | 10:44 PM
పదవ తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల పనివేళలు మళ్లీ మారాయి. క్షే త్ర స్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా విద్యాశాఖ ఉన్నతాధికారులు అదరబదరా ఉత్తర్వులు జారీ చేయడం,దానిపై వ్యతిరేకత రావడంతో వాటిని మళ్లీ సవరించడం అధికారులకు పరిపాటిగా మారింది
ఒంగోలు విద్య, మే 5 (ఆంధ్రజ్యోతి) : పదవ తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల పనివేళలు మళ్లీ మారాయి. క్షే త్ర స్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా విద్యాశాఖ ఉన్నతాధికారులు అదరబదరా ఉత్తర్వులు జారీ చేయడం,దానిపై వ్యతిరేకత రావడంతో వాటిని మళ్లీ సవరించడం అధికారులకు పరిపాటిగా మారింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 28 నుంచి జిల్లాలో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8నుంచి 12 గంటల వరకు ప్రతిరోజూ తరగతుల నిర్వహణకు షెడ్యూల్ ఇచ్చారు. ఇదిలా జరుగుతుండగా ఈనెల 1నుంచి పాఠశాల విద్యాకమిషనర్ ప్రత్యేక తరగతుల నిర్వహణకు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వుల మేరకు రోజూ ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు తరతులు నిర్వహించాలి. సెలవు దినాలు, పండుగ రోజుల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. అయితే కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మండుతున్న ఎండల్లో రెండుపూటల తరగతుల నిర్వహణ ఏలా అని టీచర్లు ప్రశ్నించారు. క్షేత్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో ప్రత్యేక తరగతుల పనివేళలను మళ్లీ సవరించారు. ఉదయం 8నుంచి 11.45 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని కమిషనర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న టీచర్లకు ఎరన్ లీవులు మంజూరు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
Updated Date - May 05 , 2025 | 10:44 PM