ముంగిట్లో మురుగు
ABN, Publish Date - Jun 18 , 2025 | 11:36 PM
: పెద్దదోర్నాల మండలంలో కీలకమైన పంచాయతీ చిన్నదోర్నాలలో రూ.లక్షల నిధులు ఖర్చు చేశారు. కానీ బీసీ కాలనీలోని కుమ్మరి వీధిని మాత్రం విస్మరించారు.
చిన్నదోర్నాల బీసీ కాలనీలో దుస్థితి
మార్కాపురం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : పెద్దదోర్నాల మండలంలో కీలకమైన పంచాయతీ చిన్నదోర్నాలలో రూ.లక్షల నిధులు ఖర్చు చేశారు. కానీ బీసీ కాలనీలోని కుమ్మరి వీధిని మాత్రం విస్మరించారు. సుమారు ఏడేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాంతంలో సీసీ రహదారి నిర్మించారు. అప్పట్లో సైడు కాలువల నిర్మాణం చేపట్టలేదు. గత వైసీపీ ఐదేళ్ల కాలంలో సుమారు రూ.50 లక్షల మేర గ్రామంలో పంచాయతీ నిధులు ఖర్చు చేశారు. బీసీ కాలనీలోని కుమ్మరవీధిలో మురుగుపారే దారిలేక సీసీ రహదారిపైనే నిలిచిపోతున్నాయి. కాలంతో సంబంధం లేకుండా ఆ వీధిలోని సుమారు 20 గృహాల ప్రజలు పాచిపట్టి దుర్గంధం వెదజల్లే మురికి నీటి మధ్యనే సహజీవనం చేస్తున్నారు. గతంలో ఈ వీధిలోని పలువురు విషజ్వరాలబారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ సమస్య తీర్చండని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆ వీధి ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వంలోనైనా తమ సమస్యకు ప్రజాప్రతినిధులు, అధికారులు పరిష్కార మార్గం చూపాలని కోరుతున్నారు.
Updated Date - Jun 18 , 2025 | 11:36 PM