ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి
ABN, Publish Date - Jun 20 , 2025 | 11:30 PM
పర్చూరు నియోజకవర్గంలో ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని, ఆయిల్ ఫామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్సోత్సాహం అంది స్తోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశి వరావు అన్నారు.
మార్టూరు,జూన్20(ఆంధ్రజ్యోతి): పర్చూరు నియోజకవర్గంలో ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని, ఆయిల్ ఫామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్సోత్సాహం అంది స్తోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశి వరావు అన్నారు. శుక్రవారం మండలంలోని ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో ఆయిల్‌ఫామ్ కంపెనీ అజంతా సోయలిమిటెడ్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సంద ర్భంగా ఏలూరి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఆయిల్‌ఫామ్ సాగు పట్ల రైతులు ఆసక్తికనబరుస్తున్నారన్నారు. సంబంధిత ఉత్పత్తులకు డిమాండు ఉందన్నారు. ఆ పంటసాగు చేసే రైతులకు భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. రైతులు లాభదాయక పంటల వైపు దృష్టి సారించాలన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు,సాంకేతికసహాయం, మార్కెటింగ్ స దుపాయాలు తదితర విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. వ్యవసాయరంగానికి ప్రోత్సా హం కల్పించే దిశగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తే గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు.ముఖ్యంగా మార్టూరు మండలంలో రైతులు పామాయిల్ సాగు చేపట్టే విధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించిందన్నారు. పంట సాగుచేసే రైతులకు హెక్టారుకు రూ.20 వేల విలువైన 150 మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. అంతేగాకుండా రైతులకు ఏడాదికి మొక్కల మెయిన్ టెయిన్స్ నిమిత్తం రూ.5250 రులను పెట్టుబడిగా ఇస్తుందన్నారు. నాలుగేళ్లుపాటు ప్రభుత్వం ఈ విధంగా సహకారం అందిస్తుందన్నారు. ఉద్యానశాఖకు ఈ కార్యక్రమాన్ని అనుసంధానించిందన్నారు. కార్యక్రమంలో అజంతా సోయా కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ పాశం సుధాకర్ రెడ్డి, మేనేజర్ సర్తాజ్‌భాషా, ఉద్యాన అధికారి హనుమంతనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 20 , 2025 | 11:30 PM