ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎంపీడీవో తీరుపై కార్యదర్శుల నిరసన

ABN, Publish Date - May 21 , 2025 | 11:46 PM

తర్లుపాడు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి చక్రపాణి ప్రసాద్‌ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

ఎంపీడీవో ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు

ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారని

ఆరోపణ

తర్లుపాడు, మే 21 (ఆంధ్రజ్యోతి) : తర్లుపాడు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి చక్రపాణి ప్రసాద్‌ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులు విధులు సక్రమంగా నిర్వహించినప్పటికీ వివిధ షాపులతో కార్యదర్శులతో నోటీసులు ఇవ్వడం ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీడీవో వైఖరిపై మూకుమ్మడిగా సెలవుపై వెళ్తున్నట్లు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. గత నెల 29న మార్కాపురం డీఎల్‌డీవో శ్రీనివాసులరెడ్డి సమావేశానికి రాని ఏడుగురు కార్యదర్శులకు మంగళవారం నోటీసులు జారీ చేశారు. మీటింగ్‌ రాని వారికి ఒక రోజు వేతనం వెనక్కి క ట్టాలంటూ మెమోలో పేర్కొన్నారు. మన మిత్ర సర్వే సక్రమంగా చేసినా పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు వారు తెలిపారు. బుధవారం మం డలంలోని పంచాయతీ కార్యదర్శులు అం దరూ మూకుమ్మడిగా సెలవు సీట్లు రాసి ఎంపీడీవోకు ఇవ్వగా వాటిని ఉన్నతాధికారులకు ఇచ్చుకోండంటూ విసిరివేశారు. ఎపీఈడీవో వైఖరిపై జిల్లా అధికారుల వద్దకు వెళ్తున్నట్లు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శుల యూనియన్‌ అధ్యక్షుడు బాలకృష్ణ మాట్లాడుతూ.. కార్యదర్శులు విధుల పట్ల నిబద్ధతో సర్వేలన్నీ పూర్తి చేసినప్పటికీ అకారణంగా మెమోలు జారీ చేశారని, జీతాలు కూడా నిలుపుదల చేస్తానంటూ బెదిరించారని అసహనం వ్యక్తం చేశారు. తమపై చిన్నచూపు చూస్తున్నారని, ఈనెల జీతాలు కూడా పెట్టనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. సుధాకర్‌బాబు, పద్మ, గోపీకృష్ణ, కాళంగి శ్రీనివాసులు, బ్రహ్మచారి, పద్మావతి, చైతన్య, రామాంజనేయరెడ్డి తదితరులు నిరసన తెలిపినవారిలో పాల్గొన్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే మెమోలు

గత నెల 9న జరిగిన డీఎల్‌డీవో శ్రీనివాసులరెడ్డి సమావేశానికి రాలేదని ఆయన చెప్పడంతో ఏడుగురు పంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ చేశాను. ఒక రోజు వేతనం కూడా వెనక్కి కట్టాలంటూ ఆదేశించా. విధుల పట్ల నిబద్ధతతో పనిచేయమని చెప్తే ఇలా తన ఎదుట నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.

- చక్రపాణి ప్రసాద్‌, ఎంపీడీవో

Updated Date - May 21 , 2025 | 11:46 PM