ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శిథిలావస్థలో పాఠశాల

ABN, Publish Date - Jul 19 , 2025 | 11:51 PM

గ్రామీణప్రాంత నిరుపేద విద్యార్థులకు విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ప్రభుత్వ పాఠశాల ప్రమాదపుటంచున ఉంది.

పెచ్చులూడుతున్న స్లాబ్‌

పెచ్చులూడుతున్న స్లాబ్‌

ఆందోళనచెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

పామూరు, జూలై 19(ఆంధ్రజ్యోతి): గ్రామీణప్రాంత నిరుపేద విద్యార్థులకు విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ప్రభుత్వ పాఠశాల ప్రమాదపుటంచున ఉంది. ఎప్పుడు ఏప్రమాదం సంభవిస్తుం దోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని లక్ష్మీనరసా పురం పంచాయతి పరిధిలో గల రేగిచెట్ల పల్లి గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు భయంభయంగా విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలకు చెందిన రెండు పాత గదులు, వంటశాల శిథిలావస్థకుచేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప స్తుతం విద్యార్థులు ఉంటున్న గది కూడా స్లాబు పె చ్చులు ఊడుతున్నాయి. దాంతో భయం భయంతో విద్యాబోధన చేయాల్సి వస్తుందని ఉపాధ్యాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని పాలకుల మాటలు ఆచరణలో కన్పించడంలేదు పాఠశాలలో 18 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. 1 నుంచి 5వ తరగతికి ఒకే ఒక గది, ఒకే ఉపా ధ్యాయుడితో విద్యాబోధన సాగుతుంది.

గత వైసీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పాఠశా లలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నాడు నేడు పథకం లో నూతన గదులు మంజూరు చేయాలని గ్రామ స్థులు కోరినా పట్టించుకోలేదు. పాఠశాల ప్రహరి గో డలు కూడా సగం విరిగిపోయి మొండి గోడలుగా ద ర్శనమిస్తున్నాయి. పాఠశాలకు చెందిన వంటగది రేకులు లేచిపోవడంతో పిచ్చి మొక్కలతో శిథిలావస్థకు చేరింది. దీంతో కుకింగ్‌ ఏజన్సీ నిర్వహకురాలు ఇంటి వద్దనే భోజనం తయారుచేసి విద్యార్థులకు వడ్డిస్తున్నా రు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికా రులు స్పందించి శిథిలావస్థలో ఉన్న ఉన్న పాఠశాల లను తొలగించి నూతన గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Jul 19 , 2025 | 11:51 PM