తల్లికి వందనం చారిత్రక పథకం
ABN, Publish Date - Jul 24 , 2025 | 11:25 PM
తల్లికి వందనం చార్రితక పథకమని ఎమ్మెల్యే సతీమణి వసంతలక్ష్మి అ న్నారు. 8వ వార్డులో గురువారం తల్లికి వందనం లబ్ధిదారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
మార్కాపురం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం చార్రితక పథకమని ఎమ్మెల్యే సతీమణి వసంతలక్ష్మి అ న్నారు. 8వ వార్డులో గురువారం తల్లికి వందనం లబ్ధిదారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కత్తిరించి చిన్నారులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో ఎంతమంది అర్హులైన విద్యార్థులుంటే అందరికీ రూ.13వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేశారన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్న ఘనత ప్రభుత్వానిదే అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రభుత్వం పాలనసాగిస్తోందన్నారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ దొడ్డా భాగ్యలక్ష్మి, మాజీ కౌన్సిలర్ షేక్ బషీరున్నీషాబేగం, టీడీపీ నాయకులు జాబీర్, రమణ, చిన్ననాగిరెడ్డి, తల్లికి వం దనం లబ్ధిదారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ
మార్కాపురం పట్టణ, మండల పరిధిలో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎ్‌ఫ) చెక్కులను వసంతలక్ష్మి గురువారం పంపిణీ చేశారు. గతంలో కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స పొంది కోలుకున్న వారికి ఆమె స్వయంగా ఇంటికి వెళ్లి మంజూరైన చెక్కులను అం దజేశారు. పట్టణ పరిధిలో ఐదుగురు, మండల పరిధిలో ఇద్దరికి మొత్తం రూ.5.34లక్షల చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభు త్వ పాలన సాగుతోందన్నారు. కార్యక్రమంలో టౌన్ మహిళా విభాగం అధ్యక్షురాలు మర్రి ఝాన్సీరాణి, ఆయా వార్డుల, గ్రామాల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
గిద్దలూరు టౌన్ : సంజీవరాయునిపేట గ్రామంలో జరిగిన తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాధవ తేజశ్వినికి మంజూరైన 24వేల సిఎం రిలీ్‌ఫఫండ్ చెక్కును అందచేశారు. ఈకార్యక్రమంలో జడ్‌పిటిసి బుడత మధుసూదన్, మార్కెట్ కమిటీ చైర్మన్ బైలడుగు బాలయ్య, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jul 24 , 2025 | 11:25 PM