ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తాగునీటికే సాగర్‌ జలాలు

ABN, Publish Date - May 25 , 2025 | 01:20 AM

సాగర్‌ కుడికాలువ ద్వారా విడుదల చేసిన నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దిశగా పర్యవేక్షించేందుకు రెవెన్యూ, పోలీస్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, పబ్లిక్‌ హెల్త్‌, మునిసిపల్‌, జలవనరుల శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించినట్లు వెల్లడించారు.

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు

ఒంగోలు కలెక్టరేట్‌, మే 24 (ఆంధ్రజ్యోతి) : సాగర్‌ కుడికాలువ ద్వారా విడుదల చేసిన నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దిశగా పర్యవేక్షించేందుకు రెవెన్యూ, పోలీస్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, పబ్లిక్‌ హెల్త్‌, మునిసిపల్‌, జలవనరుల శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించినట్లు వెల్లడించారు. ప్రాజెక్టు నుంచి ఈనెల 23న నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేశారన్నారు. దాన్ని పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలు వినియో గించుకోవాల్సి ఉందన్నారు. ఈనేపథ్యంలో వ్యవసాయ అవసరాలకు కాకుండా ట్యాంకులు, ఇతర తాగునీటి వనరులను నింపాలని కలెక్టర్‌ ఆదేశించారు. కాలువ గట్లపై గస్తీని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Updated Date - May 25 , 2025 | 01:20 AM