ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఓబీసీకి చేరిన సాగర్‌ జలాలు

ABN, Publish Date - May 28 , 2025 | 01:32 AM

తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్‌ జలాలు మంగళవారం ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు చేరాయి. జిల్లాలో రామతీర్థం జలాశయంతోపాటు అనేక మంచినీటి చెరువుల్లో నీటి పరిమాణం తగ్గటంతో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం మూడు రోజుల క్రితం కుడికాలువకు నీరు విడుదల చేసిన విషయం విదితమే.

ఓబీసీ హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రవహిస్తున్న సాగర్‌ జలాలు

998 క్యూసెక్కులు సరఫరా

మరింత పెరిగే అవకాశం

తాగునీటి వనరులను నింపేందుకు అధికారుల సన్నద్ధం

దర్శి, మే 27(ఆంధ్రజ్యోతి) : తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్‌ జలాలు మంగళవారం ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు చేరాయి. జిల్లాలో రామతీర్థం జలాశయంతోపాటు అనేక మంచినీటి చెరువుల్లో నీటి పరిమాణం తగ్గటంతో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం మూడు రోజుల క్రితం కుడికాలువకు నీరు విడుదల చేసిన విషయం విదితమే. అక్కడ నుంచి చివర్లో ఉన్న ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు జలాలు చేరడంతో మంచినీటి చెరువులకు నింపేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం సాగర్‌ ప్రధాన కాలువ 85/3 మైలుకు(ప్రకాశం సరిహద్దు) 1,793 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. అక్కడ నుంచి ఒంగోలు బ్రాంచ్‌ కాలువలకు 998 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ పరిమాణం బుధవారానికి మరింత పెరిగే అవకాశం ఉంది. నియోజకవర్గంలోని దర్శి-1, 2, చందవరం-1, 2 చెరువులకు పంపింగ్‌ ద్వారా నీరు నింపేందుకు మోటార్లు సిద్ధం చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పైర్లు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విడుదలైన నీటిని రైతులు పొరపాటున సాగునీరుగా భావించే అవకాశం ఉంది. అందువలన ఎన్‌ఎ్‌సపీ అధికారులు సాగర్‌ కుడికాలువపై నిరంతరం పర్యటిస్తూ రైతులకు సూచనలు ఇస్తున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన నీరు కేవలం తాగునీటి చెరువులకు నింపేందుకు మాత్రమేనని ఎన్‌ఎ్‌సపీ డీఈలు అక్బర్‌బాష, మోహన్‌రావులు తెలిపారు నీటి దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - May 28 , 2025 | 01:32 AM