ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మంచినీటి చెరువులకు సాగర్‌ నీరు

ABN, First Publish Date - 2025-05-28T22:55:23+05:30

మంచినీటి చెరువులకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నీరు నింపుతున్నారు. 120 గ్రామాలకు తాగునీరు అందించే ఎన్‌ఏపీ చెరువుకు మోటార్ల ద్వారా పంపింగ్‌ చేసి చెరువుకు పంపుతున్నారు.

మోటార్ల ద్వారా ఎన్‌ఏపీ చెరువుకు చేరుతున్న సాగర్‌ నీరు

దర్శి ఎన్‌ఏపీ చెరువును యుద్ధప్రాతిపదికన నింపుతున్న అధికారులు

దర్శి, మే 28(ఆంధ్రజ్యోతి) : మంచినీటి చెరువులకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నీరు నింపుతున్నారు. 120 గ్రామాలకు తాగునీరు అందించే ఎన్‌ఏపీ చెరువుకు మోటార్ల ద్వారా పంపింగ్‌ చేసి చెరువుకు పంపుతున్నారు. ప్రస్తుతం 200 హెచ్‌పీ మోటార్లు రెండు, 100 హెచ్‌పీ మోటార్లు నాలుగు, 75 హెచ్‌పీ మోటార్లు మూడు, ఒక 50 హెచ్‌పీ మోటార్లను ఆడిస్తున్నారు. ప్రస్తుతం ఎన్‌ఏపీ చెరువులో 1500 మిలియన్‌ లీటర్ల నీరు నిల్వ ఉంది. చెరువు పూర్తి సామర్థ్యం 2,547 మిలియన్‌ లీటర్లు ప్రస్తుతం ఏర్పాటు చేసిన మోటార్లు ద్వారా రోజుకు 800 మిలియన్‌ లీటర్ల నీరు పంపింగ్‌ జరుగుతోందని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ హనుమా్‌పబాబు తెలిపారు. 15 రోజుల్లో చెరువుకు నిండుగా నీరు నింపుతామని చెప్పారు. నాలుగు రోజుల క్రితం మంచినీటి చెరువులకు నీరు నింపేందుకు సాగర్‌ జలాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. సాగర్‌ జలాలు ట్యాంపరింగ్‌ కాకుండా ఎన్‌ఏ్‌సపీ అధికారులు నిరంతరం కాల్వలపై పర్యవేక్షిస్తున్నారు. మంచినీటి చెరువులు పూర్తిగా నిండేవరకు నీరు ఎక్కడా దుర్వినియోగం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయటంతో ఇరు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.

Updated Date - 2025-05-28T22:55:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising