రోహిణి రివర్స్
ABN, Publish Date - May 31 , 2025 | 02:23 AM
ఈ ఏడాది జిల్లాలో విచిత్ర వాతావరణం నెల కొంది. రోహిణి కార్తె వచ్చినా ఎండల తీవ్ర త అంతగా లేకపోవడమే కాక వాతావ రణం చల్లబడింది. సాధారణంగా రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయన్న నానుడికి అనుగుణంగా ఏటా అదేస్థా యిలో ఎండలు ఉంటాయి.
కనిపించని ఎండల తీవ్రత
గణనీయంగా తగ్గిన ఉష్ణోగ్రతలు
కార్తెకు ముందే విస్తారంగా వర్షాలు
చల్లబడిన వాతావరణం
పలు మండలాల్లో సాధారణం కన్నా రెండు నుంచి నాలుగురెట్లు అధికంగా వాన
సాగుకు ఉపక్రమించిన రైతులు
పలుచోట్ల దుక్కుల దున్నకం, విత్తనాలు చల్లకం
ఒంగోలు, మే 30 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జిల్లాలో విచిత్ర వాతావరణం నెల కొంది. రోహిణి కార్తె వచ్చినా ఎండల తీవ్ర త అంతగా లేకపోవడమే కాక వాతావ రణం చల్లబడింది. సాధారణంగా రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయన్న నానుడికి అనుగుణంగా ఏటా అదేస్థా యిలో ఎండలు ఉంటాయి. అయితే ఈసారి అందుకు పూర్తి భిన్నమైన పరి స్థితి నెలకొంది. వేసవి ముగింపు సమ యంలో వచ్చే ఈ కార్తెలో ఏడాది మొత్తం మీద అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవు తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ కార్తెలో 42 నుంచి 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆలాంటిది ఈ ఏడాది ఎండల తీవ్రత లేకపోవడమే కాక గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. ఈనెల 25 నుంచి రోహిణి కార్తె రాగా ఒంగోలు నగరంలో 35 డిగ్రీల లోపునే గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అంటే సాధారణం కన్నా ఐదారు డిగ్రీలు తక్కువ. అలాగే అత్యధిక ఉష్ణోగ్రతలు (42 నుంచి 45 డిగ్రీలు) నమోదయ్యే పలు మండలాల్లో సైతం ప్రస్తుతం 38 డిగ్రీల లోపుగానే ఉంటున్నాయి.
విస్తారంగా వానలు
ఈ ఏడాది రోహిణికార్తె వచ్చే నాటికే జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు మండలాల్లో సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు రెట్లు అధికంగా వానలు పడ్డాయి. జిల్లాలో మే నెల సాధారణ వర్షపాతం 53.0 మి.మీ. కాగా ఈనెల 27 నాటికే 103.10 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. రోహిణి కార్తె వచ్చే నాటికే దాదాపు 100 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కార్తె వచ్చిన రోజు రాత్రి కూడా జిల్లాలో భారీవర్షం కురిసింది. పశ్చిమ ప్రాంతంలోని గిద్దలూరు, రాచర్ల, పెద్దారవీడు, తర్లుపాడు, మార్కాపురం, వైపాలెం, దోర్నాల త్రిపురాంతకం, పుల్లలచెరువు, పామూరు, దొనకొడ, కనిగిరి, కంభంలతో పాటు తూర్పు ప్రాంతంలోని కొండపి, పొన్నలూరు, చీమకుర్తి, సింగరాయకొండ, అలాగే దర్శి, తాళ్లూరు, కురిచేడు తదితర మండలాల్లో రెట్టింపు నుంచి నాలుగు రెట్లు అధిక వర్షం కురిసింది.
పదునెక్కిన భూములు
జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో కూడా సాధారణం, అలాగే అధికంగా వాన కురిసింది. దీంతో చాలా ప్రాంతాల్లో భూములు పదునెక్కాయి. దీంతో రైతాంగం తొలకరి సాగుకు ఉపక్రమించింది. జూన్ ఆరంభం నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం లెక్క. కాగా అంతకు ముందే వర్షాలు పడితే తొలకరి పంటలైన నువ్వు, సజ్జ, పెసర, జనుము, జీలుగ, పిల్లిపెసర, జొన్న వంటి పచ్చిరొట్టతోపాటు పశుగ్రాస పంటలను రైతులు వేస్తారు. అయితే విస్తారంగా వానలు పడటంతో పలుచోట్ల తొలకరి పైర్లతోపాటు ఖరీఫ్ పంటలను కూడా కాస్తంత ముందుగానే వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. అధిక ప్రాంతాల్లో అందుకు వీలుగా ప్రస్తుతం దుక్కులను సిద్ధం చేస్తున్నారు. కొన్నిచోట్ల నువ్వు చల్లుతుండగా పెసర, సజ్జ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బోర్ల ద్వారా నీరు సౌకర్యం ఉన్నచోట్ల పత్తి, బొప్పాయి సాగుకు ఉపక్రమించారు. మొత్తంగా జిల్లాలో వేసవి తీవ్రత పోయి సాగు వాతావరణం రోహిణి కార్తెలో కనిపిస్తోంది. పశ్చిమ ప్రాంతంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.
Updated Date - May 31 , 2025 | 02:23 AM