ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రీ-సర్వేలో భూ వివాదాలు లేకుండా చేయాలి

ABN, First Publish Date - 2025-01-30T00:12:41+05:30

భూ సర్వేలో గ్రామాలలో ఎలాంటి భూ వివాదాలు లేకుండా అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు కోరారు. బుధవారం మండలంలోని గుంటుపల్లి రెవెన్యూ పరిధిలోని అంబడిపూడిలో జరుగుతున్న రీ సర్వేను ఆర్డీవో పరిశీలించారు. ఈసందర్బంగా ఆర్డీవో సర్వే చేస్తున్న టీంలతో మాట్లాడుతూ సర్వే చేసే సమయంలో అక్కడ ఉన్న రైతులకు నోటీసులు అం దించి వారి సమక్షంలో కొలతలు వేయాలన్నారు.

అంబడిపూడిల రీసర్వేను పరిశీలించి రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు

బల్లికురవ. జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : భూ సర్వేలో గ్రామాలలో ఎలాంటి భూ వివాదాలు లేకుండా అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు కోరారు. బుధవారం మండలంలోని గుంటుపల్లి రెవెన్యూ పరిధిలోని అంబడిపూడిలో జరుగుతున్న రీ సర్వేను ఆర్డీవో పరిశీలించారు. ఈసందర్బంగా ఆర్డీవో సర్వే చేస్తున్న టీంలతో మాట్లాడుతూ సర్వే చేసే సమయంలో అక్కడ ఉన్న రైతులకు నోటీసులు అం దించి వారి సమక్షంలో కొలతలు వేయాలన్నారు. అలానే ప్రభుత్వ భూములు అక్రమించుకొని సాగు చేస్తే వారిని నమోదు చేయవద్దు అన్నారు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన భూములకు వారి కుమారులు హక్కులు ఉంటే రికార్డులో నమో దు చేయాలన్నారు. ఎక్కడ వివాదాలు లేకుండా సర్వే పూర్తి చేయాలన్నారు. అనంతరం స్ధానిక తహసీల్ధార్‌ కార్యాలయంలో అన్ని గ్రామాల రెవెన్యూ అధికా రులతో ఆర్డీవో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో రెవెన్యూ పరమైన సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చేయాలన్నారు. ఎక్కడ చెడ్డ పేరు లేకుండా సిబ్బంది పనిచేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ రవినాయక్‌, సర్వే డీటీ ప్రహర్ష పాల్గొన్నారు.

Updated Date - 2025-01-30T00:12:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising