ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మత్స్యకారులకు ఊరట

ABN, Publish Date - Apr 27 , 2025 | 01:13 AM

వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చే భృతిని శనివారం వారి బ్యాంక్‌ ఖాతాలకు జమచేశారు. ఈ సందర్భంగా ప్రకాశం భవన్‌ లోని సమావేశం హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా నమూనా చెక్కును మత్స్యకారులకు అందజేశారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ భృతిని విడుదల చేసింది.

ఒంగోలులోని ప్రకాశం భవన్‌ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న మత్స్యకారులు

రూ.20వేల భృతి విడుదల

నమూనా చెక్కును అందజేసిన కలెక్టర్‌

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

ఒంగోలు నగరం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి) : వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చే భృతిని శనివారం వారి బ్యాంక్‌ ఖాతాలకు జమచేశారు. ఈ సందర్భంగా ప్రకాశం భవన్‌ లోని సమావేశం హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా నమూనా చెక్కును మత్స్యకారులకు అందజేశారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ భృతిని విడుదల చేసింది. ఆ సొమ్మును మత్స్యకారుల బ్యాంక్‌ ఖాతాలకు జమచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లాలో శనివారం ప్రారంభించారు. లైవ్‌ను కలెక్టరేట్‌లో మత్స్యకారులు తిలకించారు. అనంతరం కలెక్టర్‌ అన్సారియా మాట్లాడుతూ గతంలో రూ.10వేలు ఇచ్చే భృతిని ఇప్పుడు ప్రభుత్వం రూ.20వేలకు పెంచిందన్నారు. జిల్లాలోని 5,501 మంది మత్స్యకారులకు రూ.20వేలు భృతి విడుదల చేశామన్నారు. కొత్తపట్నం, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, నాగులుప్పలపాడు మండలాలకు చెందిన మత్స్యకారులకు భృతి అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మత్స్య శాఖ జాయింట్‌ డైరక్టర్‌ శ్రీనివాసరావు, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, మత్స్యకార సొసైటీ జిల్లా అధ్యక్షుడు పేరయ్య, తిరుపతిరావు, సున్నం తిరుపతి, రాయం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రూ.20వేలకు పెంచి ఇవ్వటం పట్ల మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం నాడు కలెక్టరేట్‌లో వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకారులు పాల్గొన్ని సీఎం చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబునాయుడు నిలబెట్టుకున్నాడన్నారు. కార్యక్రమంలో మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లపోతు పేరయ్య, కొత్తపట్నం ఎంపీటీసీ సభ్యుడు నరసింహారావు, కొండూరి తిరుపతిరావు, మేకల జక్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 01:13 AM