ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వృద్ధులు, దివ్యాంగులకు రేషన్‌ పంపిణీ ప్రారంభం

ABN, Publish Date - Jul 27 , 2025 | 01:22 AM

జిల్లాలో ముంద స్తుగా పౌరసరఫరాల శాఖ ద్వారా దివ్యాంగులు, 65ఏళ్లు పైబడిన వృద్ధులకు రేషన్‌ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్డుదారులకు సకాలంలో రేషన్‌ అందించేందుకు అనేక మార్పులు చేసింది.

పొదిలిలో వృద్ధురాలికి బియ్యాన్ని అందజేస్తున్న డీఎస్‌వో పద్మశ్రీ

జిల్లావ్యాప్తంగా 78,806 మంది లబ్ధిదారులు

మొదటిరోజు 12,035 మందికి అందజేత

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ముంద స్తుగా పౌరసరఫరాల శాఖ ద్వారా దివ్యాంగులు, 65ఏళ్లు పైబడిన వృద్ధులకు రేషన్‌ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్డుదారులకు సకాలంలో రేషన్‌ అందించేందుకు అనేక మార్పులు చేసింది. మొబైల్‌ వాహనాలను రద్దుచేసి షాపుల ద్వారా రేషన్‌ పంపిణీని పునఃప్రారంభించింది. దివ్యాంగులు, వృద్దులకు ఐదారు రోజులు ముందుగానే వారి ఇళ్ల వద్దకు వెళ్లి సరుకులు అందిస్తోంది. అందులో భాగంగా ఆగస్టుకు సంబంధించిన రేషన్‌ పంపిణీ జిల్లాలో శనివారం నుంచి ప్రారంభమైంది, ఈ నెలాఖరు వరకు 78,806 మంది వృద్ధులు, దివ్యాంగులకు అందజేయనున్నారు. మొత్తం 1,392 రేషన్‌ షాపులు ఉండగా వాటి పరిధిలో వృద్ధులు, దివ్యాంగులు ఎంతమంది ఉన్నారో గుర్తించి ఆయా డీలర్లకు జాబితాలను అందజేశారు. ఆ ప్రకారం సరుకులను అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. డీలర్లు కార్డుదారుని ఇంటి వద్దకు వెళ్లి వేలిముద్రలు తీసుకున్న అనంతరం బియ్యం, ఇతర నిత్యావ సర సరుకులను అందజేయనున్నారు. శనివారం నుంచి ప్రారంభ మైన పంపిణీ కార్యక్రమాన్ని పొదిలిలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పద్మశ్రీ పరిశీలించారు. మొదటి రోజు జిల్లాలో 12,035 (15.27శాతం) మందికి సరుకులు అందించారు.

Updated Date - Jul 27 , 2025 | 01:22 AM