రేషన్ పంపిణీ ప్రారంభం
ABN, Publish Date - Aug 02 , 2025 | 01:47 AM
Ration distribution begins జిల్లాలో శుక్ర వారం నుంచి రేషన్ పంపిణీ ప్రారం భమైంది. తొలి రోజు 31శాతం మంది కార్డుదారులకు సరుకులు అందజేశారు. జిల్లాలో 1,392 రేషన్ దుకాణాల పరిధిలో 6.61 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు.
తొలిరోజు 31శాతం మందికి అందజేత
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో శుక్ర వారం నుంచి రేషన్ పంపిణీ ప్రారం భమైంది. తొలి రోజు 31శాతం మంది కార్డుదారులకు సరుకులు అందజేశారు. జిల్లాలో 1,392 రేషన్ దుకాణాల పరిధిలో 6.61 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. వీరికి గత రెండు నెలల నుంచి రేషన్ షాపుల ద్వారానే బియ్యం, పంచదార అందజేస్తున్నారు. ఆగస్టు నెలకు సంబంధించిన సరుకుల పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. జిల్లాలోని అన్ని రేషన్ షాపుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పాత పద్ధతిలోనే కూటమి ప్రభు త్వం పారదర్శకంగా సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవడంతో కార్డుదారులు తమకు అనుకూలమైన సమయంలో వెళ్లి తీసుకుంటున్నారు. ప్రభుత్వం 1వతేదీ నుంచి 15వతేదీ వరకు రెండు పూటలా రేషన్ పంపిణీకి అవకాశం కల్పించినా అనేక ప్రాంతాల్లో వారం పది రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతోంది.
Updated Date - Aug 02 , 2025 | 01:47 AM