ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఎత్తిపోతల’ పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN, Publish Date - Apr 30 , 2025 | 12:05 AM

ఎత్తిపోతల పథకాల నిర్మాణం, మరమ్మతులను వేగవంతం చేసి వచ్చే వ్యవసాయ సీజన్‌కు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అధికారులు పనిచేయాలని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు.

అధికారులు, రైతులతో మాట్లాడుతున్న మంత్రి రవికుమార్‌

వచ్చే వ్యవసాయ సీజన్‌కు అందుబాటులోకి తీసుకురావాలి

నామ్‌ రోడ్డు పరిహారం చెల్లింపునకు చర్యలు

విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

అద్దంకి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): ఎత్తిపోతల పథకాల నిర్మాణం, మరమ్మతులను వేగవంతం చేసి వచ్చే వ్యవసాయ సీజన్‌కు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అధికారులు పనిచేయాలని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలో ఎత్తిపోతల పథకాల పనులు, మరమ్మతులపై ఐడీసీ అధికారులు, రైతులతో మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సమీక్షించారు. ప్రధానంగా తమ్మవరం, ఉప్పలపాడు ఎత్తిపోతల పథకాల పనులు అర్ధంతరంగా నిలిచిపోయినందున ఆయా పనులకు సంబంధించి రివైజ్డ్‌ ఎస్టిమేషన్లు సిద్ధం చేయాలన్నారు. వాటికి ప్రభుత్వం నుం చి వెంటనే అనుమతులు మంజూరు చేయిస్తానని చెప్పారు. తిమ్మాయపా లెం, కామేపల్లి, తంగేడుమల్లి, కోటావారిపాలెం, కొణిదెన, గుంటుపల్లి ఎత్తిపోతల పథకాల పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ఆయా ఎత్తిపోతల ప రిధిలోని కాలువల మరమ్మతులు కూ డా వచ్చే సీజన్‌కు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈఈ భాగ్యలక్ష్మి, డీఈ శిరాజ్‌అహ్మద్‌, ఏఈలు కృష్ణారావు, వం శీ, రవి, తమ్మవరం ఎత్తిపోతల పథ కం ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.

నామ్‌ రోడ్డు పరిహారం చెల్లింపునకు చర్యలు

నామ్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఏల్చూరు, చక్రాయపాలెం, గోపాలపురం, శింగరకొండపాలెం రైతులకు సంబంధించి పరిహారం చెల్లింపు విషయాన్ని నామ్‌ అధికారులతో మంత్రి రవికుమార్‌ చర్చించారు. మొత్తం పరిహారం రూ.2.70 కోట్లు అవసరం కాగా ప్రస్తుతం 1 కోటి రూపాయలు సిద్ధంగా ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోటి రూపాయలను కొన్ని గ్రామాల రైతులకు చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఒంగోలు ఆర్‌డీవోతో ఫోన్‌లో మాట్లాడారు. మిగిలిన నిఽధులు మంజూరు విషయమై ఆర్‌అండ్‌బీ సీఈ శ్రీనివాసరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఏల్చూరులో పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అండర్‌పాస్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. నామ్‌ అధికారులు శ్రీకాంత్‌, ప్రసాద్‌ లు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 12:05 AM