ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పంచాయతీ ఆస్తుల పరిరక్షణ

ABN, Publish Date - May 07 , 2025 | 12:31 AM

గ్రామ పంచాయ తీల ఆస్తుల పరిరక్షణకు ఆ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. వాటిని గుర్తించి జిల్లాస్థాయిలో గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో తదనుగుణంగా పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

గ్రామాల్లోనే గుర్తించి అక్కడే సభ

జిల్లా గెజిట్‌లో ప్రకటనకు చర్యలు

ప్రభుత్వ ఆదేశాలతో కదిలిన అధికారులు

ఒంగోలు కలెక్టరేట్‌, మే 6 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయ తీల ఆస్తుల పరిరక్షణకు ఆ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. వాటిని గుర్తించి జిల్లాస్థాయిలో గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో తదనుగుణంగా పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. జిల్లాలో 729 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలోని ఆస్తుల గుర్తింపును మూడు కేటగిరీలుగా విభజించారు. అందుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. కేటగిరీ-ఏలో రోడ్లు, డ్రైన్లు, బందెల దొడ్లు, తదితర అంశాలు ఉన్నాయి. కేటగిరీ-బీ కింద పంచాయతీలకు దాతలు ఇచ్చిన ఆస్తులు, వాటి ప్రస్తుత పరిస్థితిని గుర్తించాలి. కేటగిరీ-సీలో వాటర్‌ ట్యాంకులు, ఊరచెరువులు, చెరువులు, మైనర్‌ ఇరిగేషన్‌, పోరంబోకు స్థలాలు, శ్మశాన స్థలాలను గుర్తించి నోటీసు బోర్డులు పెట్టాలి. తదనంతరం ఆయా స్థలాలపై పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయాలి. ఇంకా ఏమైనా ఆస్తులు ఉన్నాయా అన్నది చర్చించి అలాంటి కూడా కూడా పొందుపర్చి జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక పంపాలి. వారు పరిశీలించి కలెక్టర్‌కు నివేదించాల్సి ఉంటుంది. తదనంతరం జిల్లా గెజిట్‌లో ప్రచురిస్తారు.

Updated Date - May 07 , 2025 | 12:31 AM