ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సాగుకు సానుకూలం

ABN, Publish Date - May 27 , 2025 | 01:33 AM

జిల్లాలో ఈ ఏడాది వాతావరణం పూర్తిగా మారింది. ప్రధానమైన వేసవి సమయంలోనూ వాన జోరు కనిపించింది. దీంతో సాగుకు సానుకూల వాతావరణం ఏర్పడింది. ఏడాది మొత్తం మీద రోహిణి కార్తెలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. అలాంటిది ఈసారి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది.

జిల్లాలో మారిన వాతావరణం

వేసవిలోనూ వానలు

ఈనెలలో ఇప్పటికే రెట్టింపు వర్షపాతం

రోహిణి కార్తె ఆరంభమైనా చల్లగానే వాతావరణం

తగ్గిన ఉష్ణోగ్రతలు

తొలకరి పైర్లు, పశుగ్రాస పంటల సాగుకు అవకాశం

ఒంగోలు, మే 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఈ ఏడాది వాతావరణం పూర్తిగా మారింది. ప్రధానమైన వేసవి సమయంలోనూ వాన జోరు కనిపించింది. దీంతో సాగుకు సానుకూల వాతావరణం ఏర్పడింది. ఏడాది మొత్తం మీద రోహిణి కార్తెలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. అలాంటిది ఈసారి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. రోహిణి ఆదివారం ప్రవేశించింది. అయినప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు మించలేదు. జిల్లాలో వార్షిక సగటు వర్షపాతం 841.50 మి.మీ కాగా మేలో 53.0 మి.మీ ఉంటుంది. అందులో ఈనెలలో ఇప్పటి వరకూ 42 మి.మీ కురవాల్సి ఉండగా 80.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రత్యేకించి కొన్ని మండలాల్లో రెట్టింపు కురిసింది. సాధారణంగా ఈ నెలలో నామమాత్రమే జల్లులు మాత్రమే ఈనెలలో పడే గిద్దలూరు, రాచర్ల మండలాల్లో మూడు రెట్లకుపైన అధికంగా పడింది. పెద్దారవీడు, మార్కాపురం, దోర్నాల, కొండపి మండలాల్లో రెండు రెట్లకు పైన కురిసింది. తర్లుబాడు, సింగరాయకొండ, తాళ్లూరు, కనిగిరి, పామూరు, దొనకొండ, ఎన్‌జీ పాడు, త్రిపురాం తకంలలో నూరుశాతం అధికంగా ఉంది. సంతనూతలపాడు, వైపాలెం, పొదిలి, మర్రి పూడి, కురిచేడు, కొత్తపట్నం, జరుగుమల్లి తదితర మండలాల్లోనూ మంచి వర్షాలు పడ్డాయి. అర్థవీడు, హెచ్‌ఎంపాడు, సీఎస్‌పురం తప్ప అన్ని మండలాల్లోనూ ఎంతో కొంత అధికంగానే వర్షపాతం నమోదైంది.

పంటల సాగుకు సానుకూలం

తాజా వర్షాలతో తొలికరి పైర్ల సాగుకు సానుకూల వాతావరణం ఏర్పడింది. అధికారికంగా ఖరీఫ్‌ సీజన్‌ జూన్‌ 1నుంచి ప్రారంభమవుతున్నా జిల్లాలో ఆ నెల మూడో వారం నుంచి తొలకరి పైర్లు, పశుగ్రాస పంటలు సాగుకు రైతులు ఉపక్రమిస్తారు. రబీ సీజన్‌లో పొగాకు, వరి, శనగ సాగు చేసే భూముల్లో ఖరీఫ్‌లో మూడు నుంచి నాలుగు నెలలోపు చేతికి వచ్చే నువ్వు, సజ్జ, పెసర, ఆలసంద వంటివి ప్రధానంగా సాగు చేస్తారు. జొన్న ఇతర పశుగ్రాస పంటలు జనుము, పిల్లపెసర, ఇతరత్రా పచ్చిరొట్ట ఎరువులకు ఉపకరించే వాటిని కూడా తొలకరి పైర్లుగా ఈ సమయంలో వేస్తారు. వాటి సాగుకు ప్రస్తుత వాతావరణం అనుకూలంగా రైతులు చెప్తున్నారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఈ వారంలోనూ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ఎండల తీవ్రత తగ్గడంతోపాటు పంటల సాగుకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని రైతులు భావిస్తున్నారు.

Updated Date - May 27 , 2025 | 01:33 AM