పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు
ABN, Publish Date - May 05 , 2025 | 10:09 PM
పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతు న్న వారికే గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శుల పదవులకు ఎంపిక చేయాలని మం డల కమిటీ నాయకులను టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఆదేశించా రు. షీలాస్కూల్ ఆవరణలో సోమవారం జరిగిన పుల్లలచెరువు మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గ్రామ కమిటీల ఎంపిక సమావేశంలో
టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
ఎర్రగొండపాలెం, మే 5 (ఆంధ్రజ్యోతి) : పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతు న్న వారికే గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శుల పదవులకు ఎంపిక చేయాలని మం డల కమిటీ నాయకులను టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఆదేశించా రు. షీలాస్కూల్ ఆవరణలో సోమవారం జరిగిన పుల్లలచెరువు మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ మండల అధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్ అధ్యక్షోపన్యాసం చేశారు. కుటుంబ సాధికారసారథలను నియమించడంలో జిల్లాలో ఎర్రగొండపాలెం ప్రథమస్థానంలో ఉందని ఎరిక్షన్‌బాబు అన్నారు. అన్ని గ్రామాల్లో పార్టీ సంస్థాగత పదవులకు మే 18వ తేదీలోపు కమిటీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని, ఆ మేరకు కమిటీను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాలు, క్లస్టర్ యూనిట్, టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శి పదవులకు కమిటీలను నియమిస్తున్నట్లు ఎరిక్షన్‌బాబు తెలిపారు. గ్రా మాల్లో కార్యకర్తల అభిప్రాయం మేరకు గ్రామ కమిటీలకు అభ్యర్థులను ఎన్నుకోవాలని మండల కమిటీ నాయకులకు ఆదేశించినట్లు చెప్పారు. అనంతరం గ్రామపంచాయతీలవారీగా గ్రామ కమిటీ కార్యవర్గాలను ఎంపిక చేశారు. కార్యక్రమంలో పుల్లలచెరువు మండల మాజీ అధ్యక్షుడు శనగా నారాయణరెడ్డి, కాకర్ల కోటయ్య, మేడికొండ లక్ష్మీనారాయణ, బీవీపుబ్బారెడ్డి, సంజీవరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - May 05 , 2025 | 10:09 PM