వైభవంగా పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు
ABN, Publish Date - May 25 , 2025 | 10:39 PM
మండలంలోని య ర్రబాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన పోలేరమ్మ దేవాలయంలో శాస్ర్తోత్తంగా విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
దొనకొండ, మే 25(ఆంధ్రజ్యోతి): మండలంలోని య ర్రబాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన పోలేరమ్మ దేవాలయంలో శాస్ర్తోత్తంగా విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వ హించారు. టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ క డియాల లలిత్‌సాగర్ పోలేరమ్మ అమ్మవారిని దర్శించు కొని పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు మోడి ఆంజనేయులు, గ్రామస్థులు డాక్టర్ లలిత్‌సాగర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు నాగులపాటి శివకోటేశ్వర రావు, షేక్ తోహీద్, తదితరులు పాల్గొన్నారు.
మహానాడుకు తరలిరావాలి
దొనకొండ, మే 25(ఆంధ్రజ్యోతి): కడపలో జరిగే మ హానాడుకు అధికసంఖ్యలో నాయకు లు, కార్యకర్తలు, అభిమానులు తర లిరావాలని టీడీపీ నియోజకవర్గ నా యకుడు డాక్టర్ కడియాల లలిత్‌సా గర్ పిలుపునిచ్చారు. ఆదివారం మం డలంలోని యర్రబాలెం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు మోడి ఆంజనేయులు గృహంలో నాయకు లు, కార్యకర్తలతో ఆయన మాట్లాడా రు. ఈనెల 27 నుంచి 29వ తేది వరకు మహానాడు జరుగు తుంద న్నారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని నాయకులకు సూచించారు. కార్య క్రమంలో నాగులపాటి శివకోటేశ్వరరావు, షేక్ తోహీద్, కొమ్మతోటి సుబ్బారావు, శృంగారపు నాగసుబ్బారెడ్డి, పత్తి వెంకటేశ్వర్లు, మన్నెం గాలయ్య, నిమ్మకాయల సు బ్బారెడ్డి, విప్పర్ల లక్ష్మీరావు పాల్గొన్నారు.
Updated Date - May 25 , 2025 | 10:39 PM