అంధకారంలో పోలవరం
ABN, Publish Date - May 04 , 2025 | 10:36 PM
మండలంలోని పోలవరం గ్రామానికి మూడు రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో గ్రామస్థులు ఆదివారం ముండ్లమూరులోని సబ్‌స్టేషన్ ఎదురుగా అద్దంకి - దర్శి ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి మూడు రోజు లు కావస్తుంటే కనీసం విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవటం లేదన్నారు.
మూడు రోజులుగా
నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
ముండ్లమూరు సబ్‌స్టేషన్ వద్ద
గ్రామస్థుల రాస్తారోకో
ముండ్లమూరు, మే 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పోలవరం గ్రామానికి మూడు రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో గ్రామస్థులు ఆదివారం ముండ్లమూరులోని సబ్‌స్టేషన్ ఎదురుగా అద్దంకి - దర్శి ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి మూడు రోజు లు కావస్తుంటే కనీసం విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. వేసవి కాలం కావటంతో ప్రజలతో పాటు మూగ జీవాలు దాహార్తితో అలమ టించి పోతున్నాయి. ఉక్కపోతతో వృద్ధులు, చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారు. దీంతో గత్యంతరంలేక గ్రామస్థులు రాస్తారోకో చేయ డంతో అద్దంకి - దర్శి రహదారికి ఇరువైపులా వాహనా లు నిలిచిపోయాయి. ఎస్‌ఐ కె.కమలాకర్ విషయం తెలుసుకొని ఏఎస్‌ఐ వెంకటేశ్వరరెడ్డి, సిబ్బందిని రాస్తా రోకో వద్దకు పంపి మాట్లాడారు. విద్యుత్ ఏఈగాని, ఉన్నతాధికారులు గాని వచ్చి హామి ఇచ్చేంత వరకు రాస్తారోకో విరమించబోమని తెలిపారు. విషయం తెలుసుకున్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వెంటనే రాస్తారోకోను విరమించాలని, వెంటనే గ్రామానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు తెల పాలని టీడీపీ మాజీ అధ్యక్షుడు సోమేపల్లి శ్రీని వాసరావును పంపించారు. దీంతో రాస్తారోకోను విర మించారు. కార్యక్రమంలో కిలారి అంజయ్య, కొర్రపాటి శ్రీనివాస రావు, బుచ్చిబాబు, నరసింహారెడ్డి, కిలా రి సుమాన్, మాలెం పాటి మంగయ్య, మదు, రావెల శ్రీని వాసరావు తది తరులు పాల్గొ న్నారు.
విద్యుత్ పునరుద్ధరణ
మండలంలోని పోలవరంలో ఆదివారం సాయంత్రం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఏఈ టి.చిన అంకబాబు తన సిబ్బందితో వెళ్ళి విద్యుత్ లైన్‌లను పరిశీలించారు. త్రీఫేజ్ విద్యుత్‌కు ఎలాంటి అంత రాయం లేకుండా గ్రామంలో విద్యుత్ సరఫరా పునరు ద్ధరించారు. కార్యక్రమంలో లైన్‌ఇన్‌స్పెక్టర్ ఎస్.సాంబయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 04 , 2025 | 10:36 PM