కన్న కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు
ABN, Publish Date - Jul 16 , 2025 | 10:35 PM
కన్న కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారు. ఈ సంఘటన ఒంగోలు నగరం మంగమూరు రోడ్డులోని జర్నలిస్ట్ కాలనీ 1వ లైన్‌లో బుధవారం జరిగింది.
ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం
ప్రేమ వ్యవహారమే కారణం?
ఒంగోలు క్రైం, జూలై 16 (ఆధ్రజ్యోతి) : కన్న కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారు. ఈ సంఘటన ఒంగోలు నగరం మంగమూరు రోడ్డులోని జర్నలిస్ట్ కాలనీ 1వ లైన్‌లో బుధవారం జరిగింది. ఇష్టం లేని పెళ్లిని చేసుకునేందుకు ఆమె నిరాకరించడంతో తల్లితండ్రులు ఆ యువతిని హత్య చేశారు. అందిన సమాచారం మేరకు... జర్నలిస్ట్ కాలనీలో ఉండే పల్నాటి తనుషా(23) ఓ యువకుడిని ప్రేమిస్తుంది. తల్లిదండ్రులు రమేష్, లక్ష్మీ మాత్రం ఆమెకు వివాహ సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో ‘మీరు చూసే సంబంధాలు వద్దు’ అంటూ తనుషా తేల్చి చెప్పింది. మంగళవారం రాత్రి రమేష్ ఫోన్ ఇవ్వాలని తనుషాను అడిగాడు. ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడై కుమార్తెపై దాడికి దిగాడు. అదే సమయంలో ఆమెను మంచం మీద పడవేసి గొంతు నులుముతుండగా, ఆ సమయంలో తల్లి లక్ష్మీ కాళ్లు గట్టిగా పట్టుకుంది. ప్రాణంపోయాక వదిలేశారు. అనంతరం తమ కుమార్తె ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందిందని బుధవారం ఉదయం ప్రచారం చేశారు. ఈమేరకు విచారణ చేపట్టిన పోలీసులు అనుమానించి తల్లిదండ్రులను విచారించగా హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది. వీఆర్‌వో ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Jul 16 , 2025 | 10:35 PM