ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వేసవిలో పశుగ్రాసం కొరతను అధిగమించాలి

ABN, Publish Date - Apr 02 , 2025 | 12:51 AM

వేసవికాలంలో పశుపోషకులు పశువులకు గ్రాసం కొరత లేకుండా చూడాలని, జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ బేబీరాణి అన్నారు.

కొనకనమిట్ల, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : వేసవికాలంలో పశుపోషకులు పశువులకు గ్రాసం కొరత లేకుండా చూడాలని, జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ బేబీరాణి అన్నారు. మండల కేంద్రం కొనకనమిట్లలోని పశువైద్యశాలను ఆమె మంగళవారం అకస్మిక తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవికాలంలో పొలాన పశువులకు తగినంత మేత దొరకదన్నారు. కావున పశువులకు గ్రాసం కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ప్రభుత్వం రాయితీపై గడ్డిజొన్నలతో పచ్చిమేత పెంచుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు పశుపోషకులకు గడ్డిజొన్న విత్తనాలను పంపిణీ చేశారు. వేసవికాలంలో పశువులకు వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించారు. పశువైద్యశాలలో నీటితొట్టి ఏర్పాటు చేసి నిత్యం నీళ్లు ఉండేలా చూడాలన్నారు. మండలంలోని పెదారికట్ల, గొట్లగట్టు వైద్యశాలలో నీటితొట్లను ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. అనంతరం వైద్యశాలలో పలురికార్డులను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి అమూల్య, వెట్నరీ అసిస్టెంట్‌ పూర్ణచంద్రరావు, సిబ్బంది పిల్లి.నాగార్జునరెడ్డి, పలువురు పశుపోషకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 12:51 AM