దర్శిలో నిల్వ ఉంచిన రేషన్‌బియ్యాన్ని పట్టుకున్న అధికారులు
ABN, Publish Date - Jul 15 , 2025 | 11:20 PM
దర్శి పట్టణంలోని అన్నపూర్ణ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు.
176 క్వింటాళ్ల రేషన్‌బియ్యం పట్టివేత
దర్శి, జూలై 15(ఆంధ్రజ్యోతి) : దర్శి పట్టణంలోని అన్నపూర్ణ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. దర్శి-కురిచేడు రోడ్డులోని ఆ మిల్లులో రేషన్‌బియ్యం నిల్వ ఉన్నట్లు సమాచారం అందటంతో ఒంగోలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రాజేష్, కృష్ణమోహన్, సింగరాయకొండ, గిద్దలూరు, దర్శి ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలు కాశయ్య, రామనారాయణరెడ్డి, రాధాకృష్ణ, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు సోమవారం రాత్రి ఆ మిల్లును ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అక్కడ రేషన్ బియ్యం 176 క్వింటాళ్లు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. బియ్యాన్ని లెక్కకట్టి గోడౌన్‌కు తరలించారు. మిల్లు నిర్వాహకులకుపై 6ఏ కేసు నమోదు చేశారు.
Updated Date - Jul 15 , 2025 | 11:20 PM