పెద్దారవీడులో క్షుద్ర పూజల కలకలం
ABN, Publish Date - May 20 , 2025 | 10:45 PM
పెద్దారవీడులో గుర్తు తెలియన వ్యక్తులు చేసిన క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఆర్టీసీ బస్టాండ్ వెనుక వెలసివున్న పురాతన గంగమ్మ ఆలయం సమీపంలో కుంకమ్మ, నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లను పొ లం యజమాని అల్లు పాలంకిరెడ్డి మంగళవా రం గుర్తించారు.
పురాతన గంగమ్మ గుడి
సమీపంలో గుంత తీసిన ఆనవాళ్లు
నిమ్మకాయలు, కుంకుమతో పూజలు
పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతు
పెద్దారవీడు, మే 20 (ఆంధ్రజ్యోతి) : పెద్దారవీడులో గుర్తు తెలియన వ్యక్తులు చేసిన క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఆర్టీసీ బస్టాండ్ వెనుక వెలసివున్న పురాతన గంగమ్మ ఆలయం సమీపంలో కుంకమ్మ, నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లను పొ లం యజమాని అల్లు పాలంకిరెడ్డి మంగళవా రం గుర్తించారు. అనంతరం సమీపంలోని చెంచుగూడెంలో విచారించగా శుక్రవారం రాత్రి ఎక్స్‌కవేటర్‌తో తవ్వకాలు చేసినట్లు తెలిపారు. పొలం పనులలో భాగంగా తవ్వకాలు జరుపుతున్నట్లు భావించినట్లు గిరిజనులు తెలిపారు. కుంకుమ, నిమ్మకాయలతో పూజ చేసిన స్థలం సమీపంలో ఎక్స్‌కవేటర్‌తో తవ్వకాలు జరిపినట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Updated Date - May 20 , 2025 | 10:45 PM