ఇంటికే ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లు
ABN, Publish Date - May 31 , 2025 | 10:49 PM
సకాలంలో ఇంటికే ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లను ప్రభుత్వంలో అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. శాంతి క్లినిక్ ఏరియాలో శనివారం పింఛన్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నారాయణరెడ్డి
మార్కాపురం, మే 31 (ఆంధ్రజ్యోతి) : సకాలంలో ఇంటికే ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లను ప్రభుత్వంలో అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. శాంతి క్లినిక్ ఏరియాలో శనివారం పింఛన్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు రెండు వీధుల్లో ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెంచిన పింఛన్ పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.4 వేల చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. దాదాపు ఇంటికే వెళ్లే ప్రతి నెలా 1వ తేదీనే అందజేస్తున్నట్లు తెలిపారు. జూన్‌కు సంబందించి 1వ తేదీ ఆదివారం వస్తున్నందున మే 31వ తేదీ శనివారం తెల్లవారేసరికి పింఛన్‌లు అందజేశారన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలన్నీ ఒకొక్కటిగా నెరవేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డీవీఎస్ నారాయణరావు, టీడీపీ నాయకు లు వక్కలగడ్డ మల్లికార్జున్, మాలపాటి వెంకటరెడ్డి, నాలి కొండయ్య, పఠాన్ ఇబ్రహీం, షేక్ మౌళాలి పాల్గొన్నారు.
పేదలకు అండగా
పెద్దారవీడు : ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ పేదలకు అండగా నిలుస్తుందని ఎంపీడీవో జాన్ సుందరం అన్నారు. మండలంలో శనివారం సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. దేవరాజుగట్టులో వృద్ధలకు ఆయనే పింఛన్ల పంపిణీ చేశారు. శివాపురంలో టీడీపీ మండల అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసులరెడ్డి, యువనాయకులు ఆనెకాళ్ల శ్రీనివాసులరెడ్డి, సర్పంచ్ లక్ష్మీదేవి పింఛన్లను పంపిణీ చేశారు.
సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
పెద్ద దోర్నాల : సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పేర్కొన్నారు. మండలంలోని ఐనముక్కుల గ్రామం ఎస్సీ కాలనీలో ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఆయన వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పేదల బాగు కోసం పథకాలను ప్రవేశపెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అయితే, వాటిని మెరుగ్గా అమలు చేయడంలో చంద్రబాబు ఇతర రాష్ట్రాలకు ఆదర్శులయ్యారన్నా రు. ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తున్నారన్నారు. జూన్‌లో విద్యాకానుక, అన్నదాత సుఖీభవ, ఆగస్టులో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్ర యాణం వంటి పథకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాసర్‌రెడ్డి, ఈవో శివకోటేశ్వరరావు, సర్పంచి చిత్తూరి హారిక, టీడీపీ నాయకులు షేక్ మాబు, బట్టు సుధాకర్ రెడ్డి, దొడ్డా శేషాద్రి, షేక్ సమ్మద్ బాషా, ఈదర మల్లయ్య, షేక్ మంజూర్‌బాషా, చంటి, దేసునాగేంద్రబాబు, చల్లా వెంకటేశ్వర్లు, షేక్ ఇస్మాయిల్, కటికల శ్రీనివాసులు, జంగిలి పిచ్చయ్య, చెంచయ్య పాల్గొన్నారు.
Updated Date - May 31 , 2025 | 10:49 PM