తుది దశలో ఎన్‌టీఆర్ పార్కు అభివృద్ధి పనులు
ABN, Publish Date - Jun 23 , 2025 | 11:30 PM
ఒంగోలు నగర పరిధిలోని 37వ డివిజన్‌లో ఉన్న ఎన్‌టీఆర్ పార్కులో కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి పనులు పూర్తి కావచ్చాయి. ఇప్పటికే కొన్ని పూర్తికాగా మరికొన్ని తుదిదశకు చేరాయి. పూర్తయిన పనులను ఈ నెలాఖరులోపు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్యలు ప్రారంభించనున్నారు. పౌరులకు మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థలు ఈ ఏడాది జనవరిలో అక్షరం అండగా- పరిష్కారం అజెండాగా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న కార్యక్రమం నిర్వహించిన విషయం విదితమే.
ఈనెలాఖరులో ప్రారంభోత్సవాలు
హాజరుకానున్న ఎమ్మెల్యే దామచర్ల, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య
37వ డివిజన్‌లో రూ.1.85 కోట్లతో కీలక పనుల మంజూరు
ఒంగోలు, జూన్ 23 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగర పరిధిలోని 37వ డివిజన్‌లో ఉన్న ఎన్‌టీఆర్ పార్కులో కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి పనులు పూర్తి కావచ్చాయి. ఇప్పటికే కొన్ని పూర్తికాగా మరికొన్ని తుదిదశకు చేరాయి. పూర్తయిన పనులను ఈ నెలాఖరులోపు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్యలు ప్రారంభించనున్నారు. పౌరులకు మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థలు ఈ ఏడాది జనవరిలో అక్షరం అండగా- పరిష్కారం అజెండాగా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న కార్యక్రమం నిర్వహించిన విషయం విదితమే. అందులో భాగంగా జనవరి 28న నగరంలోని 37వ డివిజన్ పరిధిలోని ఎన్‌టీఆర్ పార్కులో ప్రజా సదస్సు నిర్వహించగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఆ ప్రాంత సమస్యలను ప్రస్తావించారు. ప్రధానంగా నిత్యం వందలాది మంది ప్రజానీకం వాకింగ్, వ్యాయామం, పిల్లలు ఆడుకొనే ఎన్‌టీఆర్ పార్కు అభివృద్ధి విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల ఆయా అంశాలపై స్పందిస్తూ 37వ డివిజన్‌లో మొత్తం రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని, తొలుత అత్యవసర పనులు చేపడతామని హామీ ఇచ్చారు. తదనుగుణంగా చర్యలకు కార్పొరేషన్ అధికారులకు సూచించారు. దీంతో మొత్తం రూ.1.05 కోట్ల విలువైన పలు రకాల పనులను ఆ సభ అనంతరం కార్పొరేషన్ ద్వారా మంజూరు చేశారు. ప్రధానంగా ఒక్క పార్కుకు సంబంధించే రూ.50 లక్షలకు పైగా అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. డివిజన్‌లో సీసీరోడ్లు, డ్రెయిన్లు, ఇతరత్రా పనులు కూడా మంజూరు చేశారు. వాటిల్లో ఇంచుమించు సగం పనులు ఇప్పటికే పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. పార్కులో చేపట్టిన లెవలింగ్ పనులు, క్రీడాసామగ్రి, సోలార్ లైట్ల ఏర్పాటు, పార్కుకు ప్రధాన సమస్యగా ఉన్న వర్షపునీరు వెళ్లేందుకు వాకింగ్ ట్రాక్ అభివృద్ధి, పార్కు మధ్యలో సుందరీకరణ కోసం చేపట్టిన పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు పూర్తయిన పనులను ఈనెలాఖరులోపు ఎమ్మెల్యేతోపాటు ఈడీలు ప్రారంభిస్తారు. దీంతో పార్కులో తుది పనులపై కార్పొరేషన్ అధికారులు దృష్టి సారించారు.
Updated Date - Jun 23 , 2025 | 11:30 PM