ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్టీఆర్‌ బేబీ కిట్లు

ABN, Publish Date - Jun 19 , 2025 | 11:53 PM

ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేయాలి.. పేద రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలి.. ఆసుపత్రుల్లో చేరే వారికి మెరుగైన వసతులు కల్పించాలి.. ఈ ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈపాటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల నియామకాలపై దృష్టిపెట్టగా.. తాజాగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సమర్థంగా అమలైన ఎన్టీఆర్‌ బేబీ కిట్‌ పథకాలను పునరుద్ధరించింది. ప్రసవాలకు వచ్చే పేద తల్లుల నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రజాప్రభుత్వం నిర్ణయం

తల్లీ, బిడ్డలకు ఆరోగ్య వనరుల కల్పనపై దృష్టి

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన పథకాన్ని పునరుద్ధరించిన సీఎం చంద్రబాబు

ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేయాలి.. పేద రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలి.. ఆసుపత్రుల్లో చేరే వారికి మెరుగైన వసతులు కల్పించాలి.. ఈ ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈపాటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల నియామకాలపై దృష్టిపెట్టగా.. తాజాగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సమర్థంగా అమలైన ఎన్టీఆర్‌ బేబీ కిట్‌ పథకాలను పునరుద్ధరించింది. ప్రసవాలకు వచ్చే పేద తల్లుల నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఒంగోలు, కార్పొరేషన్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. ఆసుపత్రుల్లో పురుడు పోసుకున్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్‌ బేబీ కిట్లు అందించేలా చర్యలు చేపట్టింది. 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ విధానం అమలు చేయడంతో రాష్ట్రంలో లక్షలాది మంది పేద తల్లులు, నవజాత శిశువులు సురక్షితంగా ఇళ్లకెళ్లారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ పథకాన్ని తొలగించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులు, పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించింది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని తిరిగి పునరుద్ధరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు త్వరలోనే ఎన్టీఆర్‌ బేబీ కిట్లు అందించనుంది. వీటిని త్వరితగతిన ఆసుపత్రులకు అందించేలా అవసరమైన చర్యలను చేపట్టింది. దీంతో మహిళల్లో ఆనందంతోపాటు బిడ్లలకు ఈ పథకం రక్షణ కవచం కానుంది.

కిట్‌లో 11 రకాల వస్తువులు

రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న ఎన్టీఆర్‌ బేబీ కిట్‌లో11 రకాల వస్తువులు ఉంచనున్నారు. దీని ఖరీదు సుమారు రూ.1410గా ఉంటుంది. పురిటి బిడ్డలు సుఖంగా నిద్రించేందుకు బెడ్‌, దోమతెర, తల్లులు చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్‌, బేబీ సబ్బు, న్యాప్‌కిన్‌, పౌడర్‌, రెండు టవల్స్‌, చిన్న బొమ్మవంటి వస్తువులు ఉంటాయి. వీటిని బయట కొనుగోలు చేయాలంటే సుమారు రూ. 1000 నుంచి రూ.1500 వరకు ఉంటుంది. కాగా ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే పేదవారికి ఎన్టీఆర్‌ బేబీ కిట్లు ఆరోగ్యకరమైన వనరులుగా మారనున్నాయి.

జిల్లాలో నెలకు 1500 ప్రసవాలు

జిల్లాలో ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఒకటి ఉండగా, మార్కాపురంలో జిల్లా వైద్యశాల ఉంది. ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు 89, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు 9 వరకు ఉన్నాయి. వాటితోపాటు ఏరియా ఆసుపత్రులు మరో 9 వరకు ఉన్నాయి. వీటిల్లో నెలకు సుమారు 1500 వరకు ప్రసవాలు జరుగుతుండగా, వారిలో అత్యధిక శాతం మంది నిరుపేదలే. బిడ్డపుట్టగానే పరిశుభ్ర వస్త్రాల్లో ఉంచి సంరక్షణ చర్యలు చేపట్టాలి. లేకపోతే ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశం ఉంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలోనే ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపడంతో శిశుమరణాలు కూడా నమోదైన సందర్భాలు ఉన్నాయి. కాగా ప్రజా ప్రభుత్వం శిశు మరణాలు తగ్గించడంతోపాటు, తల్లుల ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టి సారించింది. దీంతోఎన్టీఆర్‌ బేబీ కిట్లు అందజేసి, తల్లి, బిడ్డ సంరక్షణ ధ్యేయంగా దృష్టి సారించింది.

Updated Date - Jun 19 , 2025 | 11:53 PM