ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తొలిరోజు నామినేషన్‌లు నిల్‌

ABN, Publish Date - Jul 31 , 2025 | 01:35 AM

కొండపి గ్రామ పంచాయతీకి ఎన్నికల నోటిఫికేషన్‌ను ఆర్వో జె.రవిబాబు బుధవారం విడుదల చేశారు. ఆ వెంటనే నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.తొలిరోజు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు.

కొండపి గ్రామ సచివాలయంలో నామినేషన్‌ల స్వీకరణకు వేచి చూస్తున్న అధికారులు

కొండపి గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

కొండపి, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : కొండపి గ్రామ పంచాయతీకి ఎన్నికల నోటిఫికేషన్‌ను ఆర్వో జె.రవిబాబు బుధవారం విడుదల చేశారు. ఆ వెంటనే నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేసేవారు రూ.1,500, వార్డు సభ్యుడిగా నామినేషన్‌ వేసే జనరల్‌ కేటగిరీకి చెందిన వారు రూ. 1,000, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన వారు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఆర్వో వివరించారు. నామినేషన్‌కు ఆర్నెళ్లలోపు తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాలని సూచించారు. నోటిఫికేషన్‌ ప్రక్రియను, నామినేషన్ల సెంటర్‌ను కొండపి ఇన్‌చార్జి ఎంపీడీవో రామకృష్ణ పరిశీలించారు. కార్యక్రమంలో స్టేజ్‌-2 ఎన్నికల అధికారి బి.ప్రసాదరావు, ఈవోఆర్డీ అంజలీదేవి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉన్నం రామ్మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 01:35 AM