సర్వేలకే పరిమితమైన నూతన లైన్లు
ABN, Publish Date - Jun 17 , 2025 | 11:11 PM
రైల్వే ప్రయాణికుల నుంచి ఆదాయాన్ని దండుకుంటున్న రైల్వేశాఖ వారికి మాత్రం మెరుగైన సౌకర్యాలను మాత్రం కల్పించడం లేదు. గిద్దలూరు నుంచి భాకరాపేటకు, కంభం నుంచి పొద్దుటూరుకు కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి సంబంధించి రైల్వే శాఖ సర్వే పనులను చేపట్టింది. సర్వే పూర్తయి ఏళ్లు గడుస్తున్నా బడ్జెట్‌లో మాత్రం ఈ రెండు రైల్వే లైన్ల నిర్మాణానికి మాత్రం నిధులు మంజూరు చేయడం లేదు. ప్రతి బడ్జెట్‌లో ఈ రెండు రైల్వేలైన్ల నిర్మాణ సర్వేకు అంతో ఇంతో కేటాయిస్తున్నారే తప్ప నిర్మాణ పనులు మాత్రం మొదలు పెట్టడం లేదు.
నిర్మాణానికి నిధులు ఇవ్వని రైల్వే శాఖ
గిద్దలూరు, జూన్ 17 (ఆంధ్రజ్యోతి) : రైల్వే ప్రయాణికుల నుంచి ఆదాయాన్ని దండుకుంటున్న రైల్వేశాఖ వారికి మాత్రం మెరుగైన సౌకర్యాలను మాత్రం కల్పించడం లేదు. గిద్దలూరు నుంచి భాకరాపేటకు, కంభం నుంచి పొద్దుటూరుకు కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి సంబంధించి రైల్వే శాఖ సర్వే పనులను చేపట్టింది. సర్వే పూర్తయి ఏళ్లు గడుస్తున్నా బడ్జెట్‌లో మాత్రం ఈ రెండు రైల్వే లైన్ల నిర్మాణానికి మాత్రం నిధులు మంజూరు చేయడం లేదు. ప్రతి బడ్జెట్‌లో ఈ రెండు రైల్వేలైన్ల నిర్మాణ సర్వేకు అంతో ఇంతో కేటాయిస్తున్నారే తప్ప నిర్మాణ పనులు మాత్రం మొదలు పెట్టడం లేదు. గిద్దలూరు నుంచి భాకరాపేటకు కొత్త రైల్వే లైన్ ని ర్మాణం చేపడితే గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు, సంజీవరాయునిపేట, ఉయ్యాలవాడ, కడప జిల్లాలోని కలసపాడు, పోరుమామిళ్ళ, బద్వేలుకు రైల్వే సౌకర్యం ఏర్పడుతుంది. దానికితోడు తిరుపతి వెళ్లేందుకు దగ్గరి దారిగా కూడా ఉంటుంది. సు మారు 150 కిలోమీటర్ల మేర ఉండే గిద్దలూరు-భాకరాపేట నిర్మాణం పూర్తయితే కడప, ప్రకాశం జిల్లాల ప్రయాణికులకు ఎంతో వెసలుబాటు కలుగుతుంది. ఈ ప్రాంతంలోని ఏ ఒక్క గ్రామానికి, పట్టణానికి ప్రస్తుతం రైల్వే సౌకర్యం లేదు కావున సౌకర్యం వచ్చినట్లు అవుతుంది. సర్వే పూర్తి అయి ఐదారేళ్లు అయినా ఇంకా సమగ్ర సర్వే అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నది. అలాగే కంభం నుంచి పొద్దుటూరుకు కూడా కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి ఇప్పటికే సర్వే దాదాపు పూర్తయింది. నిధుల సమస్య గురించి రైల్వే శాఖ ప్రస్తావించిన సందర్భంలో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం ఖర్చును భరించేందుకు కూడా ప్రతిపాదనలు జరిగాయి. కంభం-పొద్దుటూరు మధ్య 142 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించాల్సి ఉండగా, బేస్తవారపేట, కొమరోలు మండలాల్లోని, అలాగే కడప జిల్లా పోరుమామిళ్ల ప్రాంతవాసులకు కొత్తగా రైలు సౌకర్యం లభిస్తుంది. ఈ రెండు పట్టణాల మధ్య సుమారు 15 రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. కానీ రైల్వేశాఖ మాత్రం దక్షిణాదిపై చిన్నచూపు చూస్తుండగా ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంపై ఇంకా చిన్నచూపు చూస్తున్నది. ఈ రెండు కొత్త రైల్వేలైన్ల నిర్మాణం జరిగితే గిద్దలూరు, కంభం రైల్వేస్టేషన్లు జంక్షన్లుగా మారి మరింత అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రాంతవాసులకు కడప, చిత్తూరు జిల్లాలకు వెళ్లాలంటే 30 నుంచి 50 కిలోమీటర్ల దూరం తగ్గడమే కాకుండా సౌలభ్యంగా కూడా ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రెండు కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి నిధులు మంజూరు చేపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Updated Date - Jun 17 , 2025 | 11:11 PM