టీచర్ల సంఘాలతో చర్చలు సఫలం
ABN, Publish Date - May 21 , 2025 | 01:06 AM
పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ, టీచర్ల కేటాయింపు, బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులతో ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన డీఈవో కార్యాలయ ముట్టడిని తాత్కాలికంగా వాయిదా వేశారు.
నేటి డీఈవో కార్యాలయ ముట్టడి వాయిదా
ఎస్‌జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్
ఒంగోలు విద్య, మే 20 (ఆంధ్రజ్యోతి) : పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ, టీచర్ల కేటాయింపు, బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులతో ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన డీఈవో కార్యాలయ ముట్టడిని తాత్కాలికంగా వాయిదా వేశారు. మొత్తం 15 డిమాండ్లతో టీచర్ల సంఘాలు సోమ, మంగళవారాలు విద్యాశాఖ కార్యదర్శి సమక్షంలో చర్చలు నిర్వహించగా మెజారిటీ డిమాండ్లకు అధికారుల స్థాయిలోనే పరిష్కారం లభించింది. టీచర్ల బదిలీలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ప్రకటించిన అధికారులు.. ఐక్యవేదిక నాయకుల డిమాండ్ మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలను మాత్రం మాన్యువల్‌గా చేపట్టేందుకు అంగీకరించారు. ప్రభుత్వానికి, నాయకుల మధ్య అంగీకారం కుదరడంతో బుధవారం బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.
Updated Date - May 21 , 2025 | 01:06 AM