ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం..

ABN, Publish Date - Jul 15 , 2025 | 11:17 PM

నివాస గృహాలపై వెళుతున్న విద్యుత్‌లైన్‌ తొలగించాలని గ్రామస్థులు పలుమార్లు విద్యుత్‌ సిబ్బందికి మొరపెట్టుకొన్నారు. అయి నా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఇంటిపైన ఆడుకొంటున్న ఎనిమిదేళ్ల బాలికకు విద్యుత్‌ తీగలు తగిలి తీవ్రంగా గాయపడింది.

ఆడుకొంటున్న చిన్నారికి కరెంట్‌ తీగలు తగిలి తీవ్ర గాయాలు

తల్లిదండ్రుల ఆవేదన

నాగులుప్పలపాడు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): నివాస గృహాలపై వెళుతున్న విద్యుత్‌లైన్‌ తొలగించాలని గ్రామస్థులు పలుమార్లు విద్యుత్‌ సిబ్బందికి మొరపెట్టుకొన్నారు. అయి నా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఇంటిపైన ఆడుకొంటున్న ఎనిమిదేళ్ల బాలికకు విద్యుత్‌ తీగలు తగిలి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన ముప్పాళ్లలో జరిగింది. బాధితురాలి తాతయ్య తెలిపిన వివరాల మేరకు.. ముపాళ్ల గ్రామానికి చెందిన మద్దిన ఆంజనేయులు మనుమరాలు చష్మిత ఆదివారం సాయంత్రం డాబాపైన ఆ డుకొంటుండగా ఇంటి పైన వెళుతున్న 11 కేవీ విద్యుత్‌ వైర్లు ఆమె చేతికి తగిలాయి. దీంతో ఒక్కసారిగా చేయి కాలి తీవ్రంగా గాయపడడంతో కుటుంబ సభ్యులు ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం వెంటనే గుంటూరు తరలించాలని సూచించడంతో అక్కడికి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు. నివాస గృహాలపై వెళుతున్న విద్యుత్‌ లైన్లు మార్చాలని పలుమార్లు సిబ్బందికి విన్నవించినా పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితురాలి తాత ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని, బాధిత కుటుంబానికి తగిన నష్ట పరిహారం అందించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jul 15 , 2025 | 11:17 PM